Breaking News

దేవ్‌జీ, రాజారెడ్డి.. పోలీసుల అక్రమంగా నిర్భంధం?

Published on Fri, 11/21/2025 - 07:12

సాక్షి, అమరావతి: మావోయిస్టు పార్టీ అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డిలను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, వారిని కోర్టుముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దేవ్‌జీ సోదరుడు తిప్పిరి గంగాధర్, రాజిరెడ్డి కుమార్తె స్నేహలత హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై  న్యాయమూర్తులు జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్‌ తుహిన్‌కుమార్‌ గేదెల ధర్మాసనం గురువారం విచార­ణ జరిపింది.

పిటిషనర్ల న్యాయవాది యు.జైభీమారావు వా­దనలు వినిపిస్తూ.. ఈ నెల 18న పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు మృతి చెందారన్నారు. ఇదే సమయంలో దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డిలను పోలీసులు నిర్బంధించారని చెప్పారు. వారిని కోర్టుముందు ప్రవేశపెట్టేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) తిరుమణి విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ.. దేవ్‌జీ, రాజారెడ్డి పోలీసుల అదుపులో లేరని చెప్పారు. అరెస్ట్‌ చేసిన 50 మంది మావోయిస్టులను పోలీసులు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారని నివేదించారు. దేవ్‌జీ, రాజారెడ్డిలను అక్రమంగా నిర్బంధించారన్న వాదనలో వాస్తవం లేదన్నారు.  

పోలీసుల అదుపులో ఉన్నారనేందుకు ఆధారాలేమున్నాయి? 
ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. దేవ్‌జీ, రాజారెడ్డి పోలీసుల అక్రమ నిర్బంధంలో ఉన్నారనేందుకు ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించింది. ఏ ఆధారాలతో వారు పోలీసుల అదుపులో ఉన్నారని చెబుతున్నారని ప్రశ్నించింది. ఇలాంటి వ్యవహారాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోవాలంటే.. అక్రమ నిర్బంధంపై ప్రాథమిక ఆధారాలుండాలని స్పష్టం చేసింది. ప్రాథమిక ఆధారాలు లేనప్పుడు తాము చేయగలిగిందీ ఏమీ లేదని పేర్కొంది. పిటిషనర్ల న్యాయవాది జైభీమారావు స్పందిస్తూ.. దేవ్‌జీ, రాజారెడ్డిల సెక్యూరిటీ గార్డులను పోలీసులు అరెస్ట్‌ చేశారని తెలిపారు. ఎన్‌కౌంటర్‌ తరువాత పోలీసులు మీడియాతో మా­ట్లాడుతూ 9 మంది కీలకనేతలు తమ ఆ«దీనంలో ఉన్న­ట్లు చెప్పారని, ఆ వీడియోను కోర్టు ముందుంచుతామని చెప్పారు. దీంతో ధర్మాసనం.. దేవ్‌జీ, రాజారెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారనేందుకు ఆధారాలను తమ ముందుంచాలని పిటిషనర్ల న్యాయవాదికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను శుక్రవారానికి (నేటికి) వాయిదా వేసింది. 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)