Breaking News

ఇందులో తప్పేంటి బాబూ?

Published on Sun, 04/09/2023 - 04:16

సాక్షి, అమరావతి : ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా పని చేయడానికే ‘వలంటీర్ల’ వ్యవస్థ పుట్టుకొచ్చింది. ప్రభుత్వ పథకాలను మరింత సమర్థంగా ప్రజలకు చేరవేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పానికి ప్రతిరూపమే ఈ వ్యవస్థ. దాన్ని వారు సమర్థంగా నెవరేరుస్తూ వస్తున్నారు కూడా!!. నెలవారీ పింఛన్ల నుంచి మొదలుపెడితే... వివిధ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నది వారే. పైపెచ్చు వారేమీ రెగ్యులర్‌ పేస్కేళ్లలో ఉండే ప్రభుత్వ ఉద్యోగుల్లాంటి వారు కారు. ఇది... గౌరవ వేతనంపై సేవలందిస్తున్న వ్యవస్థ.

అసలు వీరిని నియమించిందే ప్రభుత్వానికి– ప్రజలకు మధ్య అనుసంధానకర్తలుగా అయినపుడు వారు ప్రజల వద్దకు వెళ్లటం తప్పెలా అవుతుంది? ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? దీనిపై మీరెంత సంతృప్తిగా ఉన్నారు? వంటి అంశాలను తెలుసుకోవటానికి వారు ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు, గృహ సారథులతో పాటు ప్రజల వద్దకు వెళితే తప్పేమయినా ఉందా? అసలెందుకు చంద్రబాబు నాయుడు ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తున్నారో తమకర్థం కావటం లేదని అటు ప్రభుత్వ యంత్రాంగం, వలంటీర్ల వ్యవస్థతో పాటు ఇటు బాబు తీరును నిశితంగా గమనిస్తున్న వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

నిజానికి చంద్రబాబు నాయుడి హయాంలో జన్మభూమి కమిటీల పేరిట పార్టీ కార్యకర్తలను నియమించి మొత్తం గ్రామాల్లోని వాతావరణాన్ని రాజకీయ పూరితం చేసేశారు. ఈ కమిటీల్లో ఉన్నది తెలుగుదేశం నాయకులే కావటంతో... వారు ఏ పథకాలనైనా ఇతర అర్హతలన్నీ పక్కనబెట్టి టీడీపీ వారికే ఇచ్చేవారు. టీడీపీ సానుభూతిపరులు కాని వారికి అప్పటిదాకా ఉన్న పథకాలను కూడా నిలిపేసి దారుణమైన పరిస్థితులు సృష్టించారు.

ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని, అర్హులైన వారికి పార్టీలకతీతంగా పథకాలు అందాలనే ఉద్దేశంతో... వలంటీర్ల వ్యవస్థకు రూపకల్పన చేశారు ముఖ్యమంత్రి జగన్‌. ప్రభుత్వ పథకాలను సమర్థంగా ప్రజలకు చేరవేస్తున్న వీరు... ఆ క్రమంలో సహజంగానే ఆయా పథకాల ప్రచార కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, గృహసారథులతో మమేకమై పాల్గొంటున్నారు. దీన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేయటమెందుకో... అసలు వలంటీర్లంటే అంత వణుకెందుకో ఎవ్వరికీ అర్థం కాదు.

ప్రజలకు మరింత మేలు..
ప్రజలకు పథకాలు అందాయా లేదా అనే విషయంపై గ్రామ, వార్డు వలంటీర్లు సర్వే చేయడాన్ని తప్పుపట్టా ల్సిన అవసరం లేదు. అర్హులైన వారికి పథకాలు అందకపోతే ఆ వివరాలను వారు నమోదు చేస్తారు. అర్హులైన వారికి పథకాలు అందకపోతే, అలాంటి వారికి ఏడాదిలో రెండుసార్లు.. జూన్, డిసెంబర్‌ నెలల్లో ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ప్రభుత్వ సేవలపై అవగాహన కల్పించడం, సర్వే చేయడం ఇది కొత్త కాదు.

రెండేళ్లుగా ప్రతి నెల చివరి శుక్ర, శనివారాల్లో సిటిజన్‌ ఔట్‌ రీచ్‌ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా ప్రతినిధుల సమక్షంలో సర్వే చేస్తే ఎక్కడైనా తప్పులుంటే తెలుస్తాయి. ప్రజలకు మరింత మేలు జరుగుతుంది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో ప్రజాప్రతినిధులతో పాటు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు పాల్గొంటున్నారు. అలాగే ఇప్పుడు ఈ సర్వేలో కూడా 
పాల్గొంటున్నారు.    – అజయ్‌ జైన్, గ్రామ, వార్డు  సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)