తుంగభద్రలో అంచనాలకు మించి నీరు

Published on Sat, 08/10/2024 - 05:50

సాక్షి, అమరావతి: ప్రస్తుత నీటి సంవత్సరం ప్రారంభంలో తుంగభద్ర బోర్డు అంచనా వేసిన 173 టీఎంసీల కంటే తుంగభద్ర డ్యామ్‌లో నీటి లభ్యత అధికంగా ఉండే అవకాశం ఉందని సాగునీటిరంగ నిపుణులు చెబుతుండటంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2019, 2020, 2021, 2022 తరహాలోనే రాష్ట్రానికి దక్కాల్సిన వాటా నీటిని విడుదల చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 

గతేడాది డ్యామ్‌లోకి కేవలం 114.58 టీఎంసీల ప్రవాహమే వచ్చినా.. రాష్ట్రానికి గరిష్ఠ స్థాయిలో నీటిని రాబట్టి ఆయకట్టు రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం పరిరక్షించిందని గుర్తుచేస్తున్నారు. జూన్‌ 1 నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు తుంగభద్ర డ్యామ్‌లోకి 249.02 టీఎంసీల ప్రవాహం వచ్చి0ది. 

ఇందులో 104.70 టీఎంసీలను డ్యామ్‌లో నిల్వచేసి.. కాలువలకు 25 టీఎంసీలు విడుదల చేసి.. మిగిలిన 120 టీఎంసీలను గేట్లు ఎత్తి దిగువకు వదిలేశారు. తుంగభద్ర డ్యామ్‌లోకి నవంబర్‌ చివరి వరకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈలెక్కన డ్యామ్‌లో నీటి లభ్యత బోర్డు అంచనా వేసిన 173 టీఎంసీల కంటే అధికంగా ఉంటుందని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు.  

కోటా నీటిని రాబడితేనే రైతులకు ప్రయోజనం  
తుంగభద్ర డ్యామ్‌లో 230 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్‌ ట్రిబ్యునల్‌.. కర్ణాటకకు 151.49, ఏపీకి 72 (హెచ్చెల్సీ 32.50, ఎల్లెల్సీ 29.50, కేసీ 10.00), తెలంగాణకు 6.51 (రాజోలిబండ డైవర్షన్‌ స్కీం) టీఎంసీల చొప్పున కేటాయించింది. ఏటా పూడిక పేరుకుపోతుండటంతో డ్యామ్‌ నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. 2016లో నిర్వహించిన సర్వేలో డ్యామ్‌ సామర్థ్యం 105.78 టీఎంసీలని తేలింది. తగ్గిన నిల్వ సామర్థ్యం, నీటిలభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తూ వస్తోంది.

2019–20, 2020–21, 2021–22, 2022–23, 2023–24ల్లో తుంగభద్ర బోర్డు చరిత్రలో అత్యధిక స్థాయిలో రాష్ట్ర కోటా కింద హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, కేసీ కెనాల్‌ వాటాను రాబట్టిన ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను పరిరక్షించింది. నాలుగేళ్లు ఏటా సగటున 69 టీఎంసీలను బోర్డు నుంచి ప్రభుత్వం విడుదల చేయించింది. 

గతేడాది తుంగభద్ర డ్యామ్‌లోకి కేవలం 114.58 టీఎంసీల ప్రవాహమే వచ్చినా.. 40 టీఎంసీలు రాష్ట్రానికి దక్కేలా చేసి రైతుల ప్రయోజనాలను పరిరక్షించింది. ఈ ఏడాది నీటి లభ్యత పెరిగిన నేపథ్యంలో 2019–23 మధ్య తరహాలోనే ఇప్పుడూ గరిష్ఠంగా నీటి వాటాను రాబట్టి ప్రయోజనాలను పరిరక్షించాలని రైతులు కోరుతున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)