Breaking News

సాగర్‌ 14 క్రస్ట్‌గేట్ల నుంచి నీటి విడుదల

Published on Tue, 09/09/2025 - 05:07

విజయపురిసౌత్‌/సత్రశాల(రెంటచింతల):  నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. సోమవారం సాగర్‌లో 14 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఈ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,12,224 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు 1,67,448 క్యూసెక్కులు వచ్చి చేరడంతో ఆ మొత్తాన్ని విడుదల చేస్తున్నారు. ఇక్కడ నుంచి కుడి కాలువకు 9,700, ఎడమ కాలువకు 9,166, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రానికి 33,658, ఎస్‌ఎల్‌బీసీకి 2,400, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్‌ జలాశయ నీటిమట్టం 589.20 అడుగులకు చేరింది. 

పులిచింతలకు 1,23,369 క్యూసెక్కులు   
నాగార్జునసాగర్‌ టెయిల్‌ పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు రిజర్వాయర్‌ ద్వారా 1,23,369 క్యూసెక్కులు పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్‌ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం సోమవారం తెలిపారు.  గరిష్ట నీటిమట్టం 75.50 మీటర్లు కాగా ప్రస్తుతం 74.48 మీటర్లకు నీటిమట్టం చేరుకున్నట్టు వివరించారు. 

రిజర్వాయర్‌ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 7.080 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.066 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు  వెల్లడించారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌ నుంచి 1,45,882 క్యూసెక్కులు వస్తుందని, పైనుంచి వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)