Breaking News

అడుగులు వెనక్కి.. ఆరోగ్యం ముందుకి..

Published on Thu, 10/23/2025 - 04:20

సాక్షి, సాగుబడి: నడక అంటే సాధారణంగా ముందుకు నడవటమే. అయితే, వెనక్కి నడిచే పద్ధతి కూడా వ్యాయామంలో ఒక భాగం. దీన్నే రివర్స్‌ వాకింగ్‌ లేదా రెట్రో వాకింగ్‌ లేదా బ్యాక్‌వర్డ్‌ వాకింగ్‌ అంటారు. సాధారణ నడక విసుగెత్తినప్పుడు మార్పు కోసం వెనక్కి అడుగులు వేయొచ్చు. దీనితో తొడ వెనుక కండరాలకు చక్కని వ్యాయామం లభిస్తుంది. మడమ శస్త్రచికిత్సల తర్వాత ఫిజియో థెరపీలో భాగంగా వెనక్కి నడిపిస్తారట. ముందుకైనా వెనక్కైనా నడక నడకే కదా.. అప్పుడప్పుడూ రివర్స్‌ గేరు వెయ్యండి మరి! 

వెనక్కి నడిస్తే తొడ కండరాలు బలం పుంజుకుంటాయట. అంతకు పూర్వం.. అంతగా వాడని కండరాలకు దీంతో వ్యాయా మం దొరుకుతుందట. అంతేకాదు, శరీరం కొత్తగా వెనక్కి కదులుతున్నప్పుడు మనసు కూడా ఈ కొత్త సవాలుకు దీటుగా స్పందిస్తుందంటున్నారు నిపుణులు. అంటే మెదడుకు కూడా వ్యాయామమే. రివర్స్‌ వాకింగ్‌ ఫలితాలపై అమెరికాలోని నెవడ యూనివర్సిటీ ప్రొఫెసర్, బయోమెకనిస్ట్‌ డా.జానెట్‌ డ్యుఫెక్‌ అధ్యయనం చేశారు.

ట్రెడ్‌మిల్‌పై సేఫ్‌!
పార్కులోనో, వీధిలోనో వెనక్కి నడిచేటప్పుడు ఇతరులకు ఇబ్బంది లేకుండా, పడిపోకుండా జాగ్రత్తపడాలి. అదే, ట్రెడ్‌మిల్‌పై చేస్తే ఈ ఇబ్బంది ఉండదని అంటున్నారు పర్సనల్‌ ట్రైనర్లు. అయితే ట్రెడ్‌మిల్‌ను స్విచ్‌ఆఫ్‌ చేసి కరెంటు లేనప్పుడు ఉపయోగించాలి. ‘ట్రెడ్‌మిల్‌ బెల్ట్‌ను మన పాదాలతోనే నెడుతూ వెనక్కి నడవాలి. అలవాటయ్యే వరకు ఇది కొంచెం ఇబ్బందే. అందుకే మొదట్లో నెమ్మదిగా చేయాలి. కానీ, కండరాలకు ఇదొక భిన్నమైన వ్యాయామం’ అంటున్నారు ఆధునిక ట్రైనర్లు. రోజువారీ వ్యాయామం ప్రారంభంలో వార్మప్స్‌లో భాగంగా కాసేపు వెనక్కి నడిస్తే చాలని సూచిస్తున్నారు. మడమ గాయాల నుంచి కోలుకున్న వారికి లేదా శస్త్రచికిత్సల అనంతరం కోలుకుంటున్న వారికి ఈ రెట్రో వాకింగ్‌ను ఫిజియో థెరపిస్టులు సూచిస్తున్నారు.

వృద్ధులకు ఉపయోగం
‘ట్రెడ్‌మిల్‌పైన హ్యాండిల్స్‌ పట్టుకొని పడిపోకుండా వెనక్కి నడిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ట్రెడ్‌మిల్‌పై వెనక్కి నడవటం వృద్ధులకు ఉపయోగకరం. ఒక నిమిషంతో మొదలు పెట్టి పది నిమిషాల వరకు నెమ్మదిగా పెంచుకుంటూ పోవచ్చు. మీకు సౌలభ్యంగా ఉండేలా వేగాన్ని, దూరాన్ని ట్రెడ్‌మిల్‌లో సెట్‌ చేసుకుని ఈ రివర్స్‌ వాకింగ్‌ ప్రయత్నించవచ్చు’ అంటున్నారు డా.డ్యుఫెక్‌.

జంట నడక మేలు!
సాధారణంగా వ్యాయామం అంటే ఒక్కరే చేస్తుంటారు. కానీ, ఈ రెట్రో వాకింగ్‌లో స్నేహితులు లేదా భార్యాభర్తలు కలిసి చేసే వెసులుబాటు ఉంది. మీ భాగస్వామికి ఎదురుగా నిలబడి, రెండు చేతులను వేళ్లు చొప్పించి బిగుతుగా పట్టుకొని, ఒకరు ముందుకు నడుస్తుంటే.. మరొకరు వెనక్కి నడవొచ్చు. అంటే ఒకరికి మామూలు నడక.. మరొకరికి వెనక నడక అన్నమాట. కాసేపటి తర్వాత అటు ఇటు మారవచ్చు. ఈ ‘జంట నడక’ అక్కడే ఆగక్కర్లేదు. అలవాటు పడిన తరువాత నెమ్మదిగా జాగింగ్‌లా చేయవచ్చు.

ఎన్ని ప్రయోజనాలో...
⇒ అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మెడిసిన్‌ అంచనాల ప్రకారం.. మామూలు వాకింగ్‌తో పోలిస్తే రెట్రో వాకింగ్‌ వల్ల దాదాపు రెట్టింపు సంఖ్యలో కేలరీలు ఖర్చవుతాయి. 
⇒  నడుము నొప్పి, జాయింట్‌ పెయిన్, ఆర్థరైటిస్‌ వంటి సమస్యలు ఉన్నవాళ్లకు ఇది మంచి వ్యాయామం అని నిపుణులు చెబుతున్నారు.
⇒ రెట్రో వాకింగ్‌ వల్ల మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. 

ఈ జాగ్రత్తలు తప్పనిసరి
⇒  ఎక్కువ మంది ఉన్నప్పుడు, వాహనాలు తిరిగే ప్రదేశాల్లో రెట్రో వాకింగ్‌ చేయవద్దు.
⇒ గరుకుగా ఉన్న ఉపరితలం లేదా రాళ్లు వంటివి ఉండే ప్రదేశాల్లో వద్దు.
⇒ హడావుడిగా, కంగారుగా చేయకూడదు.
⇒ తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు వైద్యుల సూచనలు తీసుకోవాలి.

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)