Breaking News

ఈనాడు పేపర్‌నే కూటమి సర్కార్‌ ఫాలో అయ్యేది: ఉండవల్లి

Published on Mon, 05/05/2025 - 13:01

తూర్పుగోదావరి, సాక్షి: సీనియర్‌ పోలీస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అరెస్ట్‌ వ్యవహారంపై మాజీ  ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈనాడు పత్రికకు ఆంజనేయులిపై చాలా కక్ష ఉండి ఉండొచ్చని.. ఈ అరెస్ట్‌  పోలీస్‌ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలని అన్నారాయన. 

ఈ కేసులో అసలు ముంబై నటి ని రేప్ చేసారన్న వ్యక్తిపై ఏం చర్యలు తీసుకున్నారు?. ఆంజనేయులు లాంటి  అధికారులను వేధించడం సరికాదు. ఇలా అయితే  పోలీసులు ఎలా పని చేస్తారు?. ముంబైలో నమోదైన కేసులో ఏం జరుగుతుందో?. ఈనాడు పేపర్‌కు ఆంజనేయులిపై కక్ష చాలా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈనాడు పేపర్‌లో ముందురోజు ఏమి వస్తుందో.. ఆ తర్వాతి రోజు ప్రభుత్వం అదే ఫాలో అవుతోంది అని ఉండవల్లి అన్నారు. 

ఆంధ్రా నుంచి ఎవరూ మాట్లాడరా?
ఏపీ రీఆర్గనైజేషన్ చట్టానికి సంబంధించి 11 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టులో కౌంటర్ ఫైల్ చేసిన రోజు ఇదేనని ఉండవల్లి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుటి వరకూ అఫిడవిట్ ఫైల్ చేయలేదు.  2023లో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేసింది. నేనే 43 సార్లు పార్టీ ఇన్ పర్సన్ గా కోర్టుకు హాజరయ్యాను. విభజన చట్టంలో ఆంధ్రా కు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఒక ఆర్డర్ ఇవ్వండని కోర్టును కోరాం. ఆంధ్ర నుంచి ఈ విషయం ఎవరూ మాట్లాడరు. పబ్లిక్ మీటింగ్లో మాత్రం ఆంధ్రాకు అన్యాయం జరిగిందని  మాట్లాడుతున్నారు..‌ కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడ ప్రజాప్రతినిధులు మాట్లాడటం లేదు. 

పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన కామెంట్స్

గతంలో పవన్ కళ్యాణ్ ఈ కేసుకు సంబంధించి అనుకూలంగా స్పందించారు.. అందుకే ఆయనకు లెటర్ రాశాను.. ఇప్పటికే స్టేట్ గవర్నమెంట్ వేసిన పిటిషన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ అడ్వకేట్ ను తీసుకువచ్చి వాదన వినిపించమని కోరుతున్నా. ప్రజాస్వామ్యానికి అతి ప్రధానమైన ఆర్టికల్ 100 లోక్సభలో ఏపీ రిఆర్గనైజేషన్ చట్టం చేసే సమయంలో సక్రమంగా  అమలు కాలేదు అని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు. 

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)