Breaking News

తాడిపత్రిలో వీఆర్వో కీచకపర్వం

Published on Sun, 02/09/2025 - 10:35

సాక్షి, అనంతపురం జిల్లా: కులం, మతం, ప్రాంతం చూడకుండా సంక్షేమ  పథకాలను ఇంటింటికి అందించిన రామరాజ్యం నాడు. రేషన్‌ కార్డు కావాలంటే నీ కూతుర్ని నా దగ్గరికి పంపు అని వీఆర్వో అడిగిన రావణ పాలన నేడు. రేషన్‌ కార్డు అడిగిన పాపానికి పేద వృద్ధురాలికి వచ్చిన బెదిరింపు ఇది.   

‘రేషన్‌కార్డు కావాలంటే నీ కూతురిని నా దగ్గరకు పంపించు’ అన్న ఓ వీఆర్వో కీచకపర్వం ఆలస్యంగా వెలుగుచూ­సింది. తీవ్ర మనోవేదనకు గురైన ఆ వృద్ధురాలు తన వేదనను వీడియో రూపంలో సోషల్‌ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో అధికారులు ఆ కీచక వీఆర్వోపై విచారణ చేపట్టారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం 35వ వార్డుకు చెందిన లక్ష్మీని రెండేళ్ల కిందట భర్త వదిలేయడంతో తల్లి నాగ­మునెమ్మ దగ్గర ఉంటోంది. రేషన్‌కార్డు లేనందున కుమార్తెకు ఒంటరి మహిళ పింఛన్‌ రావడం లేదని.. తన కుమార్తెకు కార్డు మంజూరు చేయాలంటూ నాగమునెమ్మ ఏడా­దిగా వీఆర్వో చంద్రశేఖర్‌ను బతిమాలుతూ వస్తోంది.

తాడిపత్రి మునిసిపల్‌ అధికారు­లకూ విన్నవించుకుంది. అయినా ఫలితం లేకపోయింది. పదే పదే వీఆర్వోను బతిమా­లు­తుండటంతో ఇదే అదునుగా భావించిన వీఆర్వో చంద్రశేఖర్‌ ‘నీ కూతురిని నా దగ్గరకు పంపించు. అప్పుడు రేషన్‌కార్డు ఇప్పి­స్తా’ అని చెప్పడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. వీఆర్వో దుర్మార్గాన్ని వీడియోలో వివరిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. దీనిపై అనంతపురం ఆర్డీవో కేశవ­నాయుడు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు తాడి­పత్రి తహసీల్దార్‌ రజాక్‌వలి శుక్రవారం నాగ­మునె­మ్మను తన కార్యాలయానికి పిలిచి విచా­రించి.. నివేదికను ఆర్డీవోకు అందించారు.

ఇదీ చదవండి: మీర్‌పేట్‌ మాధవి హత్య కేసులో మరో సంచలనం
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)