Breaking News

నాడు వద్దన్నారు..నేడు వారే దిక్కయ్యారు

Published on Thu, 09/05/2024 - 04:58

సాక్షి, అమరావతి/వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): ‘వలంటీర్లు ఏమి చేస్తారు, సంచులు మోసే పనులే కదా..అంతకుమించి వారు చేసే పనులు ఏమిటి?’ అంటూ చంద్రబాబు నాడు వలంటీర్లను ఎద్దేవా చేశారు. అయితే వరద బీభత్సానికి పాలకులకు దిమ్మతిరిగి వరద బాధి­తులకు పూర్తి స్థాయిలో సేవలు అందించడానికి వలంటీర్లే అవసరమవుతారని ఇప్పుడు గుర్తించారు. సచివాలయం, వలంటీర్‌ వ్యవస్థల పేరు కూడా ఎత్తడానికి ఇష్ట­పడని చంద్రబాబుకు వారి విలువలు, సేవలు ఇప్పుడు తెలిసివ­చ్చాయి. 

విజ­య­వాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితు­లకు సాయమందించడంలో అధికా­రులు పూర్తిగా విఫల­మ­య్యారు. ఆహారం భారీగా ఉన్నా పంపిణీ వ్యవస్థ సరిగా లేక గందరగోళ పరిస్థితులు తలెత్తుతుండటంతో అధికా­రులు వల­­ంటీర్‌ల ద్వారానే బాధితులకు సాయ­మందించగలమని సీఎంకు చెప్పారు. దీంతో వెంటనే సీఎం ఆదే­శాలతో అధికారులు వలంటీర్లకు కబురు చేస్తు­న్నారు. 

బుధవారం నుంచి సచివాల­యాల సిబ్బంది, వలంటీర్లు ఎక్కడికక్కడ సహా­యక కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది.  నేటి నుంచి పూర్తి స్థాయి­లో వలంటీర్లు సేవలు అందించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.  

గతంలో వరదలొస్తే వలంటీర్లతోనే బాధితులకు భోజనం ఏర్పాట్లు
గోదావరి వరద ముంపులో ఉన్న వందలాది మంది బాధితుల వద్దకు పీకల్లోతు నీళ్లలో వెళ్లి వలంటీర్లు తక్షణ సాయాన్ని అందించి వెలకట్ట లేని సేవలతో ప్రశంసలు అందుకున్నారు. 2020, 2022ల్లో గోదావరికి వరదలు వచ్చిన సమయంలో..వరదలు వస్తాయన్న ముందస్తు సమాచారంతో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ ముందుగానే వల­ంటీర్లను అప్రమత్తం చేసి బా«ధితులను ఆదుకు­న్నారు. అధికారులు కూడా వెళ్లడానికి సాహ­సించని లోతట్టు లంక గ్రామాలకు ప్రాణాలకు తెగించి ప్రభుత్వం సమకూర్చిన సహాయ సామగ్రి, నిత్యావసరాలను బాధితులకు వలంటీర్ల కొద్ది గంటల్లోనే అందించారు. 

గతంలో వరదల సమ­యంలో గోదావరి ఏటిగట్లకు గండ్లు పడి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించిన సందర్భాలు కోకొల్ల­లుగా ఉండగా, 20219–23 మధ్య వరదల సమ­యంలో ప్రతి అర కిలో మీటర్‌ ఏటిగట్టు పర్య­వేక్షణ బాధ్యత ఒక వలంటీర్‌కు అప్పగించడంతో వారు ప్రజలను అప్రమత్తం చేస్తూ వచ్చారు. అప్పట్లో ఏటిగట్లకు ఊలలు పడినా, గట్లు కుంగిపోయినా, గండ్లు పడిన విషయం ఉన్నతాధికా­రులకు చేరేసరికి జరగాల్సిన నష్టం జరిగిపో­యే­ది. వలంటీర్లు వరద సేవల్లో పాల్గొన్న­ప్పుడు, వర­దల్లో చిక్కుకున్న బాధితు­లను గుర్తించడం దగ్గర నుంచి పునరావాస కేంద్రాలకు తరలింపు, భోజనాలు, నిత్యావసరాల పంపిణీలో ప్రాణా­లకు తెగించి సేవలందించారు. 

మధ్యాహ్నం 12 గంటలు దాట­కుండానే బాధితులకు భోజనం ప్యాకెట్లు, మంచినీళ్లు అందించారు. 2020, 2022 జూలై, ఆగస్ట్‌ల్లో సంభవించిన వరదల్లో మామిడి­కు­దురు మండలం పెదపట్నం గ్రామంలోనైనా, బి.దొడ్డవరం, అప్పనపల్లి బాడవ గ్రామాల్లో మో­కా­లి­కి­పైగా నీటిలో వలంటీర్లు నడచి భు­జాలపై ఆహార పొట్లాలు తీసుకువెళ్లి ఊరందరికీ ఆహా­రం, తాగునీటి ప్యాకెట్లు అందజేశారు. నాటి వర­దల్లో జగన్‌ ప్రభు­త్వం ఉచితంగా నిత్యావస­రాలు, కూరగా­యలను ఏటిగట్లకు చేర్చితే, ఏటిగట్టు నుంచి ఏ గ్రామానికి ఆ గ్రామ వలంటీర్‌ బాధ్యతగా తీసుకుని పడవలో తీసుకువెళ్లి అందించారు.   

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)