Breaking News

ఆస్తి కోసం.. కన్న కొడుకే కాలయముడై..!

Published on Sun, 04/27/2025 - 08:35

పూసపాటిరేగ( విజయనగరం జిల్లా): కడుపున పుట్టిన కొడుకే ఆస్తికోసం తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో గుద్దించి హతమార్చిన ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పాండ్రింకి అప్పలనాయుడు (55), పాండ్రింకి జయమ్మ (53)కు రాజశేఖర్, రాధ ఇద్దరు పిల్లలు. కుమార్తె రాధను ఆనందపురం మండలం నేలతేరుకు చెందిన వ్యక్తితో వివాహం చేశారు. 

ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలం తరువాత ఆమె మృతిచెందింది. తమకు ఉన్న 80 సెంట్లు పొలంలో వివాహ సమయంలో 20 సెంట్లు భూమిని రాధ పేరిట తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్‌ చేశారు. దీనిపై కుమారుడు రాజశేఖర్‌ తల్లిదండ్రులపై కక్ష పెంచుకున్నాడు. భూమి విషయమై వారితో కొంత కాలంగా గొడవపడుతున్నాడు. తల్లిదండ్రుల నుంచి విడిపోయి తన భార్య, కుమార్తెతో కలిసి వేరుగా నివసిస్తున్నాడు. సొంతంగా ట్రాక్టర్‌ నడుపుతున్నాడు. వ్యసనపరుడు కావడంతో అప్పుల పాలయ్యాడు. 

ఈ క్రమంలో గ్రామానికి సమీపంలోని నడుపూరి కల్లాల వద్ద రాధకు ఇచ్చిన భూమిని విక్రయించేందుకు సిద్ధపడ్డాడు. ఇందులో భాగంగా జేసీబీ, ట్రాక్టర్‌ సాయంతో చదునుచేసే పనులను సాయంత్రం చేపట్టాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లి కుమారుడిని ప్రశ్నించారు. ఈ క్రమంలో వారిపై ఆగ్రహంతో ఊగిపోతూ ట్రాక్టర్‌తో ఢీకొట్టి హతమార్చాడు. వారు మృతి చెందినట్టు నిర్ధారణ అయ్యాక అక్కడ నుంచి ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. భోగాపురం రూరల్‌ సీఐ జి.రామకృష్ణ, ఎస్‌ఐ ఐ.దుర్గాప్రసాద్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)