Breaking News

భర్త చనిపోయిన బాధలో ఉంటే.. ఆమెపై కన్నేశాడు

Published on Sat, 06/06/2026 - 11:49

విశాఖపట్నం: మరణించిన స్నేహితుడి భార్యను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు జిల్లా మహిళా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి ఎస్‌.దామోదరరావు శుక్రవారం తీర్పు వెలువరించారు. అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎస్‌.వి.రమణ తెలిపిన వివరాల ప్రకారం.. జ్ఞానాపురంలో కె.ప్రసాద్‌ అనే వ్యక్తి భార్య లక్ష్మి, పిల్లలతో కలిసి జీవించేవాడు. ప్రసాద్‌ స్నేహితుడైన ధనాల అరుణ్‌కుమార్‌ (30) కూడా అదే ప్రాంతంలో నివసించేవాడు. 

2019లో ప్రసాద్‌ అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న లక్ష్మిపై నిందితుడు కన్నేశాడు. తన కోరిక తీర్చాలంటూ వేధించడం ప్రారంభించాడు. బాధితురాలు నిరాకరించడంతో ఆమెను బెదిరింపులకు గురిచేశాడు. దీనిపై బాధితురాలు 2021 ఏప్రిల్‌లో కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టులో నేరం రుజువు కావడంతో నిందితుడు అరుణ్‌కుమార్‌కు మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.200 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)