Breaking News

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేదికగా విశాఖ

Published on Fri, 05/16/2025 - 04:32

సాక్షి, విశాఖపట్నం: ప్రధాని నరేంద్రమోదీ వచ్చే నెలలో విశాఖలో పర్యటించనున్నారు. జూన్‌ 21న విశాఖ వేదికగా ‘యోగా ఫర్‌ వన్‌ ఎర్త్‌.. వన్‌ హెల్త్‌’థీమ్‌తో నిర్వహించనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యలో సుమారు 45 నిమిషాల పాటు జరగనున్న యోగాసనాల కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, యోగా అభ్యాసకులు, ఉద్యోగులు, సాధారణ పౌరులు, డిఫెన్స్‌ స్టాఫ్, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, క్రీడాకారులు, ఇతర సంస్థల కార్యకర్తలు సహా సుమారు 2.5 లక్షల మంది భాగస్వామ్యం కానున్నారు.

ఇందుకోసం జిల్లా యంత్రాంగం 24 చదరపు అడుగులకు ఒకరు చొప్పున కూర్చునేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి చోటా 3 నుంచి 4 వేల మంది యోగాసనాలు వేసేలా అనువైన మైదానా­లను గుర్తిస్తున్నారు. ప్రధానితో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రముఖులు స్థానిక ఆర్కే బీచ్‌ రోడ్‌ లేదా ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో జరిగే ప్రధాన వేడుకలో భాగస్వామ్యం కానున్నారు. 

ఈ నెల 29 నుంచి నాలుగు వారాల పాటు యోగా దినోత్సవంపై ప్రచారం చేస్తారు. జూన్‌ 5 నుంచి వారం రోజుల పాటు ప్రతి నియోజకవర్గంలోనూ, 17 నుంచి విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఒక్కరినీ ప్రధాని కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.  

Videos

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)