Breaking News

ఇద్దరి రైల్వే ఉద్యోగుల మధ్య వివాహేతర సంబంధం

Published on Wed, 10/01/2025 - 07:35

విశాఖపట్నం జిల్లా: రైల్వే ఉద్యోగుల మధ్య నెలకొన్న వివాహేతర సంబంధం చివరికి చాకుపోట్లకు దారితీసింది. తనతో సంబంధం కొనసాగిస్తున్న మహిళ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని భరించలేని ఒక ఉద్యోగి ఈ దాడికి పాల్పడ్డాడు. తొలుత దోపిడీ కేసుగా నమోదైన ఈ ఘటన.. 

పోలీసుల దర్యాప్తులో వివాహేతర సంబంధమే అసలు కారణంగా తేలడంతో నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి గోపాలపట్నం పోలీసులు తెలిపిన వివరాలివి.. జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెం, గణపతినగర్‌లోని ఒక రెసిడెన్సీలో నివాసముంటున్న చంద్రకళ(రైల్వే ఉద్యోగి) భర్త మరణానంతరం ఉద్యోగం పొందింది. ఆమెకు రైల్వే మెకానికల్‌ విభాగంలో పని చేసే ఏనుగుల నాగరాజుతో వివాహేతర సంబంధం ఉంది. శనివారం రాత్రి నాగరాజు చంద్రకళ ఇంటికి వచ్చాడు. రాత్రి అక్కడే ఉన్నాడు. 

అయితే, చంద్రకళ మరొకరితో సంబంధం కొనసాగిస్తోందని అనుమానం పెంచుకున్న నాగరాజు.. మధ్య రాత్రి తాను వెళ్లిపోతున్నానని చెప్పి.. అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌పై దాక్కున్నాడు. నాగరాజు వెళ్లిపోయాడని భావించిన చంద్రకళ.. లోకో పైలెట్‌గా పని చేస్తున్న గౌరి నాయుడును తన ద్విచక్ర వాహనంపై వెళ్లి తీసుకువచ్చింది. కొద్దిసేపటి తర్వాత, మేడపై దాగి ఉన్న నాగరాజు ఆమె ఇంటికి వచ్చి గొడవకు దిగాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడై ఇంట్లో ఉన్న చాకుతో దాడి చేశాడు. ఈ దాడిలో గౌరి నాయుడు, చంద్రకళ ఇద్దరికీ గాయాలయ్యాయి. వెంటనే ముగ్గురూ చంద్రకళ కారులో బయలుదేరగా.. నాగరాజు గోపాలపట్నంలో దిగిపోయాడు. గౌరి నాయుడు, చంద్రకళ చికిత్స నిమిత్తం కేజీహెచ్‌లో చేరారు. 

దోపిడీగా నమ్మించే ప్రయత్నం
ఆసుపత్రి వర్గాల సమాచారం మేరకు గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే గాయపడిన గౌరి నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. తాను డ్యూటీ దిగి ఉత్తర సింహాచలం నుంచి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారని పేర్కొన్నాడు. బంగారు చైన్, డబ్బులు అడిగారని, నిరాకరించడంతో కత్తితో దాడి చేశారని చెప్పాడు. దీంతో గోపాలపట్నం పోలీసులు తొలుత దోపిడీ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే లోతుగా దర్యాప్తు చేయగా.. అసలు దాడికి కారణం రైల్వే ఉద్యోగుల మధ్య ఉన్న వివాహేతర సంబంధమేనని తేలింది. రహస్యం బయటపడకుండా ఉండేందుకే బాధితులు తప్పుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసులో వాస్తవం బయటపడటంతో నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం అతన్ని రిమాండ్‌కు తరలించారు.  

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)