Breaking News

విశాఖ స్టేడియంకు వైఎస్సార్‌ పేరును కొనసాగించాలి

Published on Fri, 03/21/2025 - 05:26

సాక్షి, విశాఖపట్నం: విశాఖ పీఎంపాలెంలోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం వద్ద వైఎస్సార్‌­సీపీ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. టీడీపీ కూట­మి ప్రభుత్వం కుట్రచేసి స్టేడియం ఆధునీ­కరణ పనుల్లో భాగంగా ఏర్పాటుచేసిన ఎంట్రన్స్‌ ఆర్చ్‌పై, స్టేడియానికి చెందిన ఫసాట్‌లలో వైఎస్సార్‌ పేరు తొలగించినందుకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గురువారం శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. 

మాజీమంత్రి, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ ఆధ్వర్యంలో మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, జెడ్పీ చైర్‌పర్సన్‌ జె. సుభద్ర, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు తొలుత స్టేడియం వద్ద ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి పాలతో ఆభిషేకం చేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నల్ల రిబ్బన్లతో పెద్దఎత్తున నిరసన చేపట్టారు. తొలగించిన వైఎస్సార్‌ పేరును యథావిధిగా పెట్టాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేసింది. 

విశాఖ ఉత్తర సమన్వయకర్త కేకే రాజు హౌస్‌ అరెస్ట్‌..
మరోవైపు.. ఈనెల 19న విశాఖ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం వద్ద వైఎస్సార్‌సీపీ ఆందోళన చేపడుతుందని పిలుపునిచ్చిన మరుక్షణం నుంచి టీడీపీ కూటమి ప్రభుత్వం కుయుక్తులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి నుంచే వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు, కార్పొరేటర్లకు పోలీసులు ఫోన్లుచేసి బెదిరించారు. 

నిరసన కార్యక్రమానికి ఎవరినైనా తీసుకెళ్తే అరెస్టుచేస్తామని హెచ్చరించారు. విశాఖ నార్త్‌ నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజును పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. పలువురు వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతల ఇళ్లకు వెళ్లి మరీ వార్నింగ్‌లు ఇచ్చారు.

ఐపీఎల్‌ మ్యాచ్‌లవల్లే శాంతియుత నిరసన
మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌
ఈనెల 24, 30 తేదీల్లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఉన్న నేపథ్యంలో విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ను కాపాడాలన్న ఉద్దేశంతో క్రీడాకా­రులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేశామని మాజీమంత్రి, విశాఖజిల్లా వైఎస్సా­ర్‌సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌­నాథ్‌ అన్నారు. టీడీపీ కూటమి పార్టీల ఎంపీలు ఏసీఏలో సభ్యులుగా ఉండడంతోనే కుట్రపూరితంగా డాక్టర్‌ వైఎస్సార్‌ క్రికెట్‌ స్టేడియం ఆర్చ్‌పై వైఎస్సార్‌ పేరు తొలగించారని మండిపడ్డారు. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్‌ మార్క్, ఆయన బ్రాండ్‌ కనబడకూడదనే వైఎస్సార్‌ పేరును తొలగించేందుకు కుట్ర చేశారని అమర్‌నాథ్‌ మండిపడ్డారు. గతంలో విశాఖ అభివృద్ధిలో భాగంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సీతకొండ వ్యూ పాయింట్‌కు వైఎస్సార్‌ పేరు పెడితే దాన్ని తొలగించారని ఆక్షేపించారు.

అలాగే, విశాఖ ఫిలింనగర్‌ క్లబ్‌ లాన్‌కు వైఎస్సార్‌ పేరు తొలగించారని, ఇవేకాక.. ఉమ్మడి విశాఖ జిల్లాలో అనేకచోట్ల వైఎస్సార్‌ విగ్రహాలు ధ్వంసం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వైఎస్సార్‌ పేరును ఏసీఏ తొలగించిందా..? లేదంటే కూటమి ప్రభుత్వం ఒత్తిడితో తొలగించారా..? 48 గంటల్లో  ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ సమాధానం చెప్పాలని అమర్‌నాథ్‌ డిమాండ్‌ చేశారు. 
 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)