Breaking News

నార్వే చిన్నది.. వైజాగ్‌ చిన్నోడు..

Published on Sat, 01/17/2026 - 09:30

విశాఖపట్నం: ప్రేమకు దేశాలు, సరిహద్దులు అడ్డుకావని నిరూపించింది ఈ జంట. ఏడు సముద్రాల అవతల పుట్టిన ఓ యువతి, మన వైజాగ్‌ కుర్రాడి ప్రేమలో పడి.. పెద్దలను ఒప్పించి భారతీయ సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యేందుకు సిద్ధమైంది. శుక్రవారం వీరి నిశి్చతార్థం అత్యంత వైభవంగా జరిగింది.  

నార్వేలో చిగురించిన ప్రేమ 
ఎన్‌ఏడీ జంక్షన్‌ శాంతినగర్‌(అంబేడ్కర్‌ నగర్‌)కు చెందిన గొట్టిపల్లి జ్ఞాన్‌ ప్రకాష్‌ కుమారుడు సైమన్‌ 2016లో ఉద్యోగ రీత్యా నార్వే వెళ్లారు. అక్కడ ఓ బ్యాంకులో ఉద్యోగిగా స్థిరపడ్డారు. అదే ప్రాంతంలో స్పీచ్‌ అండ్‌ లాంగ్వేజ్‌ థెరపిస్ట్‌గా పనిచేస్తున్న తూరాతో సైమన్‌కు పరిచయం ఏర్పడింది. రెండేళ్ల కిందట నార్వేలో జరిగిన ఓ మ్యూజిక్‌ క్విజ్‌లో తొలిసారి కలుసుకున్న వీరి పరిచయం ప్రేమగా మారింది. తూరాలోని స్వచ్ఛమైన నవ్వు, స్వేచ్ఛా భావాలు సైమన్‌ను ఆకట్టుకోగా, సుమారు రెండేళ్ల డేటింగ్‌ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని ఇళ్లలో చెప్పగా, ఇరు కుటుంబాలు సానుకూలంగా స్పందించాయి. భారతీయ కుటుంబ వ్యవస్థ, నార్వే కుటుంబ వ్యవస్థకు దగ్గరగా ఉంటుందని, ఇక్కడి వారిలో కనిపించే ప్రేమ, ఆప్యాయతలు తమకు ఎంతగానో నచ్చాయని వధువు కుటుంబ సభ్యులు తెలిపారు. తన కోడలిని భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో చూడాలన్న ఆశతో, తొలి బహుమతిగా చీరను అందించానని వరుడి తండ్రి జ్ఞాన్‌ ప్రకాష్‌ సంతోషం వ్యక్తం చేశారు. 

వంటకాలు అదిరిపోయాయ్‌.. 
ఈ వేడుకకు హాజరైన నార్వే అతిథులు భారతీయ వంటకాలు ‘యమ్మీ’ అంటూ లొట్టలేశారు. చీరకట్టులో భారతీయ స్త్రీలు ఎంతో అందంగా ఉన్నారని, ఇక్కడి వారి మర్యాదలు, ఆప్యాయమైన పలకరింపులు తమను మంత్రముగ్ధులను చేశాయని ఆనందం వ్యక్తం చేశారు. ఒకరినొకరు అర్థం చేసుకుని, నిండు నూరేళ్లు కలిసి జీవిస్తామని నూతన జంట ఆనందం వ్యక్తం చేసింది. కాగా.. మాజీ డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్, బీఎస్‌ కృష్ణ తదితరులు పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)