Breaking News

జనసేన నేత ప్రేలాపలనపై భగ్గుమన్న కార్మిక సంఘాలు

Published on Tue, 09/17/2024 - 09:22

విశాఖపట్నం, సాక్షి:  స్టీల్‌ ప్లాంట్‌ను పరిరక్షిస్తామని ప్రకటనలు ఇవ్వాల్సిందిపోయి.. అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తున్న కూటమి నేతలపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జననేన నేత బొలిశెట్టి సత్యనారాయణ తాజాగా చేసిన ప్రేలాపనలపై విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ భగ్గుమంది.

ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. కార్మికులకు కోపం వస్తే చెప్పులతో కొడతారు అని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ ఆదినారాయణ, జనసేన నేతను హెచ్చరించారు. సాక్షి టీవీతో ఆదినారాయణ మాట్లాడుతూ.. ‘‘స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల కోసం జనసేన నేత బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కార్మిక సంఘాల పోరాటం వలనే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ అన్నారు. అలాంటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. కార్మికులకు కోపం వస్తే చెప్పులతో కొడతారు.

వైజాగ్‌ స్టీల్ ప్లాంట్ నిర్మాణ దశ నుంచి కార్మిక సంఘాలు పోరాటాలు చేస్తున్నాయి. మా పోరాటాలను శంకిస్తే ఊరుకునేది లేదు అని ఆదినారాయణ హెచ్చరికలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపే దిశగా ఎలాంటి ప్రయత్నం కనిపించడం లేదు. ఇది కార్మికుల్లో మరింత ఆందోళనకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను కలిసి చర్చించాలని కార్మిక సంఘాలు నిర్ణయించుకోగా, ఈలోపే ఆ పార్టీకే చెందిన నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

  • స్టీల్ ప్లాంట్ ను కాపాడుతున్నది కార్మిక సంఘాలే
  • బొలిశెట్టి ఢిల్లీలో మోసాలు చేసి విశాఖ వచ్చారు
  • కార్మిక నాయకుల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు
  • దమ్ముంటే బొలిశెట్టి ఒక నెలపాటు కార్మిక నాయకుడిగా ఉంటే కార్మికులు ఎవరిని కొడతారో అర్ధమవుతుంది
  • ప్రైవేటీకరణ చెయ్యాలనుకున్న బీజేపీ పంచన చేరి అవాకులు చావాకులు మాట్లాడితే కార్మికులు తగిన బుద్ది చెబుతారు

:::నీరుకొండ రామచంద్రరావు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేత

  • బొలిశెట్టి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
  • పవన్ కళ్యాణ్ ఆదేశాలతోనే బొలిశెట్టి సత్యనారాయణ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు
  • స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడం కోసం ప్లాంట్ నిర్మాణ దశ నుంచి అనేక పోరాటాలు చేశాం
  • స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో పవన్ కల్యాణ్‌ విఫలమవుతున్నారు
  • డైవర్షన్ కోసమే కార్మిక సంఘాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు
  • ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. త్వరలోనే తగిన బుద్ధి చెపుతారు..

::: ఎన్, రామారావు, సీఐటీయూ లీడర్

	జనసేన నేత వ్యాఖ్యలను ఖండించిన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు

 

సంబంధిత వార్త: విశాఖ ‍ప్లాంట్‌పై జనసేన నేత సంచలన వ్యాఖ్యలు

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)