Breaking News

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉక్కు కార్మికుల డెడ్‌లైన్‌

Published on Thu, 11/21/2024 - 09:49

సాక్షి, విశాఖ: విశాఖ ఉక్కు కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డెడ్ లైన్ విధించారు. తమకు చెల్లించాల్సిన జీతాలను వారం రోజుల్లోగా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు.. జీతాలు ఇవ్వని పక్షంలో ప్రధాని మోదీ విశాఖలో అడుగుపెట్టేందుకు అర్హత లేదంటూ సీపీఎం నేత కామెంట్స్‌ చేశారు.

విశాఖ ఉక్కు కార్మికుల జీతాల విషయంపై సీపీఎం నేత గంగారావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్.. విశాఖ వచ్చే లోపు కార్మికులకు జీతాలు చెల్లించాలి. లేదంటే విశాఖలో కాలుపెట్టే అర్హత లేదు.. అడుగడుగునా ముట్టడిస్తాం. ఉద్యోగుల జీతాల విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకోవాలి.

ఉక్కు కార్మికులకు ఇంత అన్యాయం జరుగుతుంటే విశాఖ ఎంపీ ఏం చేస్తున్నారు?. యూనివర్సిటీని నడుపుకోడానికి నిన్ను ఎంపీని చేయలేదు. జీతాలకోసం యాజమాన్యంతో మాట్లాడాలి. ఎంపీ మాట కూడా యాజమాన్యం వినకపోతే ఉద్యమంలోకి రావాలి. ఆయనతో కలిసి మేమంతా ఉద్యమిస్తాం అని చెప్పుకొచ్చారు. 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)