Breaking News

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కార్మికుల సమ్మె సైరస్‌

Published on Fri, 04/04/2025 - 08:10

సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో సమ్మె సైరన్‌ మోగింది. ఈనెల 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు 14వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు వెళ్లనున్నట్టు అఖిలపక్ష కార్మిక సంఘాల నిర్ణయం తీసుకుంది. కాగా, స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం దిగి వచ్చే వరకూ సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

వివరాల ప్రకారం.. విశాఖ స్టీల​్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్‌ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. 14వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో రేపు కుర్మన్నపాలెంలో రాస్తా రోకో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే, సమ్మెకు రాజకీయ పార్టీల మద్దతును కార్మికులు కోరుతున్నారు. ఇదే సమయంలో ఏడో తేదీన మరోసారి ఆర్‌ఎల్‌సీతో చర్చలు జరపనున్న‍ట్టు కార్మిక సంఘాలు తెలిపాయి. ఈ క్రమంలోనే స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు.. ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతిపత్రం ఇవ్వనున్నారు. ఇక, యాజమాన్యం దిగి వచ్చే వరకూ సమ్మె చేపట్టాలని నిర్ణయించినట​ఉట తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో భారీగా కాంట్రాక్ట్‌ ఉద్యోగుల తొలగింపు జరిగింది. స్టీల్ ప్లాంట్‌ మరో 1500 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగించారు. గతంలో 1100 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించిన విషయం తెలిసిందే. కార్మికుల ఆందోళన కొనసాగుతున్నప్పటికీ తొలగింపు ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే, స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం దాదాపు 4500 మందిని తొలగించాలని ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇక, సీఎం చంద్రబాబుతో స్టీల్ సెక్రటరీ భేటీ అనంతరం కార్మికుల తొలగింపు జరగడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కార్మిక సంఘాలు నేతలు మండిపడుతున్నారు. 

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)