Breaking News

నెల క్రితమే పెళ్లి.. కొత్త జంటను ఇలా వెంటాడిన మృత్యువు

Published on Mon, 06/16/2025 - 09:07

సాక్షి, గాజువాక: వివాహమైన నెల రోజులకే ఒక జంట మృత్యు ఒడికి చేరింది. కాళ్ల పారాణి ఆరకముందే విధి ప్రమాద రూపంలో కబళించింది. నగరంలో సరదాగా షికారు చేసి వద్దామనుకొని బయల్దేరిన కొత్త జంట రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. దీంతో, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఈ విషాద ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.

గాజువాక ట్రాఫిక్‌ పోలీసులు అందించిన వివరాలివి.. కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన జొన్నాడ సాయి(27), పెదగంట్యాడ మండలం గంగవరం గ్రామానికి చెందిన శాలిని (25) గాజువాకలోని యాపిల్‌ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్లుగా పని చేస్తున్నారు. వీరిద్దరూ ప్రేమించుకొని నెల రోజుల కిందట పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం శ్రీహరిపురంలో ఒక అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం ల్యాబ్‌కు సెలవు కావడంతో షికారు కోసం నగరంలోకి వెళ్లేందుకు ద్విచక్రవాహనంపై బయల్దేరారు.

ములగాడ మీదుగా పోర్టు రోడ్‌లోని మారుతీ సర్కిల్‌ వద్ద వెనుకనే వస్తున్న ఒక ట్రాలర్‌ వారిని ఢీకొని ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో సాయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తీవ్ర గాయాలపాలైన శాలినిని షీలానగర్‌లోని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స ప్రారంభించే సమయానికి మృతి చెందిందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టు నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు సీఐ కోటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఇదే రోడ్డులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయిల్‌ ట్యాంకర్‌ కింద పడి ఇద్దరు నేవీ వైద్యులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.. 24 గంటల వ్యవధిలో నలుగురు మృత్యువాత పడటం.. వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)