Breaking News

న్యాయం జరగకపోతే ఉద్యమమే మార్గం

Published on Mon, 09/01/2025 - 05:49

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన నోషనల్‌ ఇంక్రిమెంట్లు సెప్టెంబర్‌ నెలాఖరుకల్లా మంజూరు చే­యా­­లని ఉద్యోగుల ఐక్యవేదిక డిమాండ్‌ చేసింది. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు శ్రీకారం చుడతామని హెచ్చరించింది. ఉద్యోగులు ఎదుర్కొంటు­న్న పలు సమస్యలపై ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్‌ ఎండీ జాని పాషా, సెక్రటరీ జనరల్‌ విప్పర్తి నిఖిల్‌ కృష్ణ, కన్వీనర్‌ షేక్‌ అబ్దుల్‌ రజాఖ్‌ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో ముఖ్యా­ంశాలు..

⇒ సచివాలయ ఉద్యోగులు సర్వీస్‌లో చేరి ఆరు సంవత్సరాలు పూర్తయినా నోషనల్‌ ఇంక్రిమెంట్లు మంజూరు కాలేదు.

⇒  ఒకే కేడర్‌లో ఆరు సంవత్సరాలు పూర్తి చేసిన వారికి ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌ స్కీమ్‌ ప్రకా­రం స్పెషల్‌ ఇంక్రిమెంట్‌ ఇవ్వాలన్న నిబంధన అమలు కాలేదు.

⇒ ఒకే కేడర్‌లో ఆరు సంవత్సరాలు పూర్తి చేసిన వారికి ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌ స్కీమ్‌ ప్రకా­రం స్పెషల్‌ ఇంక్రిమెంట్‌ ఇవ్వాలన్న 
నిబంధన అమలు కాలేదు.

⇒ ఈ అంశాల్లో న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి వెనుకాడబోము. 
⇒ పనిభారం, అన్యాయమైన ఆదేశాలను ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు. 
⇒ సచివాలయాల శాఖ కేవలం సర్వేల శాఖగా మారిపోయింది.

⇒ పండుగలు, ఆదివారాలు, సెలవు దినాల్లోనూ తప్పనిసరి విధులు, ఇంటింటి సర్వేల వల్ల ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతింటోంది.  
⇒ రోజువారీ టార్గెట్ల ఒత్తిడితో కుటుంబ జీవితం దూరమవుతోంది. ఇది ఉద్యోగుల ఆత్మహత్యలకు సైతం దారితీస్తోంది.  

⇒ ఇక ఇటీవల జరిగిన అనైతిక బదిలీల ప్రక్రియతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  
⇒ బదిలీల కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించి, స్టేషన్‌ సీనియారిటీ ఆధారంగా పారదర్శక విధానాన్ని అమలు చేయాలి.  
⇒ పేస్కేల్‌ అసమానతలు తొలగించి, కేడర్‌ అప్‌గ్రేడ్‌ చేయాలని పలు సార్లు వినతులు చేసినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)