Breaking News

‘ఆవకాయ అమరావతి’ కార్యక్రమానికి షాక్‌

Published on Sun, 12/28/2025 - 14:47

సాక్షి, విజయవాడ: ఆవకాయ అమరావతి కార్యక్రమానికి షాక్‌ తగిలింది. పున్నమి ఘాట్‌లో జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఆవకాయ అమరావతి కార్యక్రమం నిర్వహించడానికి  సిద్ధమవ్వగా.. పున్నమి ఘాట్‌లోని ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ అడ్డం తిరిగారు. తమను సంప్రదించకుండా తమ ప్రైవేట్ భూముల్లో ఏ విధంగా కార్యక్రమం పెడతారంటూ యజమానులు మీడియా సమావేశం నిర్వహించారు. ఎగ్జిబిషన్‌కు నోటీసులు ఇవ్వకుండా పడగొట్టడంపై మండిపడ్డారు.

భవానీపురం పున్నమి ఘాట్ భూమి యజమానుల సంఘం నేతలు మాట్లాడుతూ.. పున్నమి ఘాట్‌లోని మా‌ భూముల్లో ఎవరెవరో చొరబడుతున్నారు. పున్నమిఘాట్‌లో 20 ఎకరాల వరకు ప్రైవేటు పట్టా ల్యాండ్ ఉంది. మా‌ భూమిని కాపాడుకోవడానికి గోడలు కట్టుకుంటున్నా కానీ కూల్చివేస్తున్నారు. మా‌ భూములకు రక్షణ అవసరం. పుష్కరాలు సమయం నుంచి భూమిలిచ్చి ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరిస్తున్నాం. మా‌ భూములను ఇప్పటివరకు కాపాడుకుంటూ వచ్చాం. అయినా మా‌ సహనాన్ని పరీక్షిస్తున్నారు

..మా హద్దులు వేసుకొని మా‌ భూములను కాపాడుకుంటాం. ప్రభుత్వం కూడా సహకరించాలని కోరుతున్నాం. ఎగ్జిబిషన్‌కు అన్ని అనుమతులు ఉన్నాయి. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పడగొట్టేస్తారా?. ఏమైనా అంటే కలెక్టర్ ఆదేశాలంటున్నారు. ప్రైవేట్ స్థలాల్లో కూల్చివేతలకు ముందస్తు నోటీసులు ఇవ్వరా?. ఎవరికో మేలు చేసేలా రౌడీల్లా వ్యవహరిస్తే సహించం.

కలెక్టర్‌ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. మా స్థలాలను వాడుకుంటున్నారు మాకు పరిష్కారం చూపించడం లేదు. 20 ఏళ్లుగా వాడుకుంటూ మాకు రూపాయి బిళ్ల ఇవ్వడం లేదు. ప్రైవేట్ ల్యాండ్స్‌ కార్యక్రమాలు పెడితే ఎలా?. ప్రభుత్వ కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తున్నాం కదా అని మా భూముల నుంచి మమ్మల్నే పంపేస్తారా?. ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం.. మాకు సహకరించకుంటే మేం సహకరించం. న్యాయపరంగా ఎదుర్కొంటాం.. మా భూముల పరిరక్షణకోసం అందరం ఏకమయ్యాం’’ అని ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ పేర్కొన్నారు.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)