Breaking News

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?

Published on Wed, 09/04/2024 - 06:11

సాక్షి, అమరావతి: ‘ఈ ప్రభుత్వం మా కోసం ఏం చేస్తోందో అర్థం కావడం లేదు. గుక్కెడు మంచి నీళ్లు కూడా ఇవ్వట్లేదు. ఇళ్లు మునిగిపోయి.. ఆహారం, మందులు, విద్యుత్‌ లేక పిల్లలతో, వృద్ధులతో తీవ్ర అవస్థలు పడుతున్నాం. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడం లేదు’ అని విజయవాడలోని ముంపు ప్రాంతాల బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు మునిగిపోయి తాము ఏడుస్తుంటే.. సీఎం చంద్రబాబు పడవలో అటూ, ఇటూ తిరుగుతూ చేతులూపుకుంటూ వెళ్లిపోతున్నారని వాపోయారు. తమను సురక్షిత ప్రాంతాలకు చేర్చే ప్రయత్నాలు ఎందుకు చేయట్లేదంటూ బాధితులు కన్నీరు పెట్టుకున్నారు.

 విజయవాడలోని కుమ్మరిపాలెం సమీపంలో ఉన్న లోటస్‌ లెజెండ్‌ అపార్ట్‌మెంట్‌ మొదటి అంతస్తు నీట మునిగింది. దీంతో అపార్ట్‌మెంట్‌ వాసులు బయటకు వచ్చే పరిస్థితి లేక ఆకలితో అలమటిస్తున్నారు. 193 కుటుంబాలు ఉంటున్న తమ అపార్ట్‌మెంట్‌ నీటిలో చిక్కుకుంటే.. ప్రభుత్వం గాలికి వదిలేసిందని గోనుగుండ్ల శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులుగా తాగునీరు, విద్యుత్‌ లేదని వాపోయారు. తమ క్షేమ సమాచారం బయటి ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులకు చెబుదామన్నా, సెల్‌ఫోన్‌లు పని చేయక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని గణేశ్‌ అనే బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం పట్టించుకోలేదని.. పడవ వాళ్లకు చెప్పి బయటి నుంచి 400 ఆహార పొట్లాలు తెప్పించుకుంటుంటే దారిలోనే పోలీసులు అడ్డుకున్నారని వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. హృద్రోగంతో బాధ పడుతున్నానని, మందుల కోసం పడవ వాళ్లను అడిగితే రూ.వెయ్యి అడుగు­తున్నారని నాగేశ్వరమ్మ వాపోయింది. న్యూ ఆర్‌ఆర్‌లో వరదలో చిక్కు­కున్న తమను ఒడ్డుకు చేర్చాలని ప్రభుత్వ బోట్ల వాళ్లను అడి­గితే మనిషికి రూ.వెయ్యి అడుగుతున్నారని ఎ.రవికుమార్‌ వాపో­యాడు. పాత ఆర్‌ఆర్‌పేటలోని జేపీ అపార్ట్‌మెంట్‌లో 300 కుటుంబాలకు పైగా ఉంటున్నాయని, తాగు నీరు, ఆహారం లేక ఇబ్బంది పడుతున్నామని రామాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)