Breaking News

సీతారాం ఏచూరికి విజయసాయిరెడ్డి నివాళి

Published on Sat, 09/14/2024 - 13:22

సాక్షి, ఢిల్లీ: ప్రముఖ రాజకీయ వేత్త, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాళులర్పించారు. ఆయన భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. సీపీఎం నేతలు రాఘవులు, మధులను పరామర్శించిన విజయసాయిరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘‘పీడిత పక్షాన రాజీలేని పోరాటం చేసిన యోధుడు ఏచూరి. నమ్మిన సిద్ధాంతాలను జీవితాంతం ఆచరించారు. ఏచూరి విషయ పరిజ్ఞానం, భావ ప్రకటన స్ఫూర్తిదాయకం. ఏచూరితో పార్లమెంట్‌లో కలిసి పనిచేసే అవకాశం లభించడం మర్చిపోలేను’’ అని విజయసాయి పేర్కొన్నారు.

ఏచూరికి విజయసాయి రెడ్డి నివాళి

ఇదీ చదవండి: అలా వెళ్లిపోయావేం... ఏచూరీ!

శనివారం ఉదయం వసంత్‌కుంజ్‌లోని ఇంటి నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయానికి ఏచూరి భౌతిక కాయాన్ని తరలించారు. అక్కడ  పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. విదేశాల నుంచి వచ్చిన కమ్యూనిస్టు నేతలు, దేశంలోని ప్రముఖలు నివాళులర్పించేందుకు వీలుగా అక్కడ ఉంచారు. అనంతరం మధ్యాహ్న సమయంలో ఏచూరి భౌతిక కాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించనున్నారు. ముందే ప్రకటించిన విధంగా విద్యార్థుల వైద్య పరిశోధనల నిమిత్తం అప్పగించనున్నారు.

 


 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)