Breaking News

నీతులు చెప్పే ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డీ.. ఇప్పుడేమంటావ్‌!

Published on Sun, 01/04/2026 - 05:42

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మల­మడుగు బీజేపీ ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారా­యణరెడ్డి కుమారుడే డ్రగ్స్‌ కేసులో పట్టుబడటం సిగ్గు చేటని, గంజాయి, డ్రగ్స్‌ను పెంచి పోషిస్తు­న్నది కూటమి నేతలేనన్న విషయం ఈ ఘటనతో తేటతెల్లమైందని వైఎస్సార్‌సీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘నిద్రలేచింది మొ­దలు ప్రవచనకర్తలా ఆదినారాయణరెడ్డి నీతులు చెబుతుంటారు. కానీ.. ఆయన కుమారుడు సుధీర్‌రెడ్డి ఇంట్లోనే డ్రగ్స్‌ తీసుకుంటూ తెలంగాణ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇప్పుడేమంటావ్‌ ఆదినారాయణ­రెడ్డీ. ఇప్పటికైనా వాస్తవాలు ఒప్పుకుంటావా?గంజాయి, డ్రగ్స్‌ను  పెంచి పోషిస్తున్నది మీ కూటమి నేతలేనని?

తండ్రీకొడుకులు పరువు తీశారు 
‘ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సాగిస్తున్న అరాచకా­లు అన్నీఇన్నీ కావు. కడప జిల్లాలో ఎక్కడ రౌడీ­యిజం జరిగిగా అక్కడ ఆదినారాయణరెడ్డి ఉంటారు. గంజాయి, డ్రగ్స్‌ను అలవాటు చేసి రౌడీల­ను పెంచిపోషిస్తున్నారు. చివరకు ఎమ్మెల్యే కొడుకు అవే డ్రగ్స్‌కు అలవా­టుపడి తెలంగాణ పోలీసు­లకు దొరికిపో­యాడు. తండ్రీ కొడుకులు కలిసి ఇటు రాష్ట్రం పరువుతోపాటు వైఎస్సార్‌ కడప జిల్లా పరు­వు­ను బజారుకు ఈడ్చారని కడప జిల్లా ప్రజలు అంటున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే డ్రగ్స్‌ను అరికడతామని గొప్పగా చెప్పిన పాలకులు చివరకు రాష్ట్రాన్ని డ్రగ్స్‌ గుప్పిట్లోకి నెట్టేశారు.

రాష్ట్రంలో డ్రగ్స్‌ వినియోగం 260 శాతం పెరిగిందని డీజీపీ చెప్పడం ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. సాక్షాత్తు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడే డ్రగ్స్‌ కేసులో పట్టుబడటం చూస్తే కూటమి పాలన ఎంత దారుణంగా ఉందో స్పష్టంగా తెలుస్తోంది. గంజా­యి నిర్మూలన కోసం నాటి వైఎస్‌ జగన్‌ సర్కార్‌ పెద్ద యుద్ధమే చేసింది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం డ్రగ్స్‌ మత్తులో కూరుకుపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరం. 

బాబు పాలనలో హాస్టళ్లు నిర్వీర్యం
చంద్రబాబు పాలనలో సంక్షేమ హాస్టళ్లు నిర్వీర్యం అయ్యాయని విడదల రజిని మండిపడ్డారు. చంద్ర­బాబు నిర్లక్ష్యంతో 46 మంది ప్రాణాలు కోల్పో­యారని, ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఆహారం, తాగునీరు కలుషితం కావడం, పారిశుద్ధ్యం క్షీణించడం వల్లే విద్యార్థుల వరుస మరణాలు సంభవిస్తున్నాయన్నారు. హాస్టళ్లలో మరణ మృదంగం మోగటానికి కారణం పాలనా వైఫల్యం కాదా.. దీనికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)