Breaking News

తిరుపతి సంస్కృత వర్సిటీ కేసులో కీలక పరిణామం

Published on Tue, 12/09/2025 - 14:57

సాక్షి, తిరుపతి: జాతీయ సంస్కృత యూనివర్శిటిలో(Tirupati Sanskrit Versity)  లైంగిక వేధింపుల కేసు‌‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాధిత యువతి వీడియో స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన తిరుపతి మహిళా పోలీసులు.. కీలకమైన వివరాలను రాబట్టినట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా నిందితులిద్దరినీ పోలీసులు మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. 

‘‘ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్‌‌ నన్ను లైంగికంగా వేధించారు. ఆ వేధింపులు తట్టుకోలేక పైఅధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యా. అయితే ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి వద్ద నా వ్యక్తిగత వీడియో ఉందని చెబుతూ లక్ష్మణ్‌ బెదిరింపులకు దిగాడు. ఆపై పలుమార్లు లైంగికంగా వేధించాడు. లక్ష్మణ్‌లాంటివాళ్లకు కఠినమైన శిక్ష పడాలి’’ అని పోలీసుల వద్ద ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలస్తోంది. 

తిరుపతి వెస్ట్‌ స్టేషన్‌ నుంచి మహిళా పోలీసుల బృందం ఒడిశా జార్హ్ పూర్‌లో బాధితురాలిని విచారించి.. ఈ మేరకు వీడియో స్టేట్‌ మెంట్ రికార్డు చేశారు. బాధితురాల స్టేట్మెంట్ ఆధారంగా ఇద్దరు ప్రొఫెసర్లను అరెస్ట్‌ చేశారు. 

నిందితుల ఆరెస్టును తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం మీడియా సమావేశంలో ధృవీకరించారు. ‘‘సాంస్కృతిక విశ్వవిద్యాలయంలో విద్యార్థిపై అనుచిత ప్రవర్తన ఘటన చోటు చేసుకుంది. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఫిర్యాదుతో  వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఒడిషాకు చెందిన యువతి ఈ ఏడాది జూన్‌లో బీఈడీ కోర్సులో జాయిన్ అయింది. అయితే.. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్న లక్ష్మణ్ కుమార్ తన హోదాను వినియోగించుకుని ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విద్యార్థినితో చనువుగా ఉంటున్న దృశ్యాలను శేఖర రెడ్డి అనే వ్యక్తి చిత్రీకరించాడు. ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక బృందాన్ని ఒడిషాకు పంపి బాధితురాలి నుంచి ఆధారాలను సేకరించాం. లక్ష్మణ్ కుమార్, శేఖర్ రెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం’’ అని వెల్లడించారు. 

పార్లమెంట్‌లో ఆందోళన.. 
తిరుపతి సంస్కృత వర్సిటీ ఘటన పార్లమెంట్‌లోనూ చర్చ జరిగింది. లోక్‌సభలో సోమవారం అడ్జర్న్‌మెంట్‌ మోషన్‌ నోటీసు ద్వారా వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి విషయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. బీఈడీ మొదటి సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థినిని అదే వర్సిటీలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగికంగా వేధించారని సభలో తెలిపారు. వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను అడ్డుపెట్టుకుని బెదిరించారన్నారు. అది అత్యంత హేయమ చర్యగా అభివర్ణించారు. దళిత విద్యార్థినిపై ఇటువంటి దురాగతం జరగడం పట్ల పార్లమెంట్ వేదికగా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాల్సిన గురువులే ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడటం తిరుపతి ప్రతిష్టకు దెబ్బతీస్తోందని ఎంపీ పేర్కొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)