Breaking News

రద్దీలో వద్దనుకున్నా.. అంతలో దుర్ఘటన

Published on Sat, 01/11/2025 - 08:37

మద్దిలపాలెం: రద్దీగా ఉండడంతో క్యూలోంచి బయట వెళ్లిపోదాం అనుకున్నంతలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో తన భార్య రజని ప్రాణాలు కోల్పోయిందని భర్త గుడ్ల లక్ష్మారెడ్డి భోరుమంటూ విలపించారు. అప్పటి వరకూ ఇద్దరం కలిసి క్యూలో జాగ్రత్తగా వెళ్తున్న సమయంలో రద్దీ అధికమవ్వడంతోపాటు గేట్లు తెరిచారని, దీంతో జనం ఒక్కసారిగా క్యూలో కదలడం పలువురి ప్రాణాలు పోవడానికి కారణమయిందని మద్దిలపాలేనికి చెందిన మృతురాలు రజని భర్త లక్ష్మారెడ్డి వాపోయారు. 

రెండు గంటల తర్వాత జాడ తెలిసింది 
‘తొక్కిసలాటలో తప్పిపోయిన రజని కోసం వెతుకుతున్నా. ఎక్కడా జాడలేదు. దీంతో ఏం చేయాలో తెలియలేదు. నా చేతిలో ఫోన్‌కూడా రజనీ బ్యాగులో ఉండిపోయింది. దీంతో అక్కడే వున్న ఆటో డ్రైవర్‌ ఫోన్‌ ద్వారా కాల్‌ చేస్తున్న పనిచేయలేదు. ఏం జరిగిందో తెలియదు. రెండు గంటల తర్వాత ఆస్పత్రిలో చేర్పింపిచారని సమాచారం అందింది. ఆ ఆస్పత్రి ఎక్కడుందో తెలియక ఆటో ద్వారా అక్కడి చేరుకున్నా. వెళ్లి చూసే సరికి విగత జీవిగా పడి ఉంది’అంటూ బోరున విలపించారు.  

అమెరికా నుంచి హుటాహుటిన వచ్చిన హర్షవర్ధన్‌ రెడ్డి.. తల్లి భౌతికకాయాన్ని చూసి సొమ్మసిల్లిపోయాడు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రజనీ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.   

నేడు అంత్యక్రియలు  
అమెరికా నుంచి మృతురాలి తమ్ముడు శనివారం విశాఖ వస్తున్నారు. అతను రాగానే అంత్యక్రియలు నిర్వహిస్తామని భర్త లక్ష్మారెడ్డి తెలిపారు.  

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)