Breaking News

‘నాకు, ఎమ్మెల్యే శ్రీధర్‌కు మధ్యే వివాదం’

Published on Thu, 01/29/2026 - 19:29

అమరావతి:  రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్‌పై మరో వీడియో విడుదల చేసింది  బాధితురాలు. తనను ఎవరో రెచ్చగొట్టి పంపారనే వార్తలపై బాధితురాలు స్పందించింది. తనన  ఏ పార్టీ రెచ్చగొట్ట పంపలేదన్నారు. తనకు జరిగిన అన్యాయంపైనే మీడియా ముందుకు వచ్చానని ఆమె స్పష్టం చేశారు.  కూటమి నేత తాతంశెట్టి నాగేంద్ర కొంతమంది పేర్లు చెప్పి తనను బద్నాం చేస్తున్నారన్నారు. 

తనకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం కొనసాగిస్తానన్నారు.  తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎమ్మెల్యే మోసం చేశారని, అందుకే అన్ని విషయాలు బయటపెట్టానన్నారు. తప్పు ఎవరిదైతే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు బాధిత మహిళ. తనకు ఎమ్మెల్యే నుంచి ఒక్క రూపాయి కూడా వద్దని స్పష్టం చేసింది. 

కాగా,  బాధిత మహిళతో  కూటమి పార్టీ నేత తాతంశెట్టి నాగేంద్ర చెప్పిన మాటలు కూడా ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ‘ఇంక నిన్ను వాళ్లు కలుపుకోరు.. నువ్‌ మోసపోయావ్‌.. అయ్యిందేదో అయ్యింది.. నువ్‌ సర్దుకుపోవడం మంచిది’ అంటూ సదరు బాధిత మహిళతో నాగేంద్ర తెర వెనుక రాజీ చేసే యత్నం చేశారు.  ఎమ్మెల్యే అరాచకాలు బయటకు రాకుండా ఆపేందుకు తెర వెనుక కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారనే దానికి ఇదొక ఉదాహరణ.   

కూటమి స్థానిక నేత తాతంశెట్టి నాగేంద్ర స్వయంగా బాధితురాలికి నాలుగు రోజుల క్రితం ఫోన్‌ చేసి మాట్లాడారు. శ్రీధర్‌ ఇంటిలో ఒప్పుకోవడం లేదని, జరిగింది మరచిపోయి సర్దుకుపోవాలని సలహా ఇచ్చారు. ఇంకా అతనే కావాలని వెళితే మళ్లీ మళ్లీ మోసపోవడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. నీ కొడుకు కోసం అన్నీ వదిలేసి ముందుకు వెళ్లిపోవాలంటూ సలహా ఇచ్చారు. నిన్ను దూరం చేసుకుంటున్నందుకు ఎమ్మెల్యే బాధ పడతారని తాను అనుకోవడం లేదని నాగేంద్ర అన్నారు. బెంగళూరులో తన కుమారుడు చదివే కాలేజీ అమ్మాయిలతోనూ ఎమ్మెల్యే శ్రీధర్‌ ఫ్లర్ట్‌ (లోబరుచుకునే ప్రయత్నం) చేశారని, ఆ విషయం తన కుమారుడి ద్వారా తెలిస్తే తాను ఆ విషయం బయటకు రాకుండా సర్ధి చెప్పానని ఆయన కొత్త విషయాన్ని బయటపెట్టారు. 

ఇది కూడా చదవండి: 

ఎమ్మెల్యే శ్రీధర్‌ నాపై లైంగిక దాడి చేశారు

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)