Breaking News

చంద్రబాబు పాలనలో ఆర్యవైశ్యులపై విచ్చలవిడిగా దాడులు

Published on Sun, 01/04/2026 - 04:46

సాక్షి, అమరావతి: చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలోని ఆర్యవైశ్యులపై దాడులు మితిమీరిపోయాయని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ విజయవాడ పశి్చమ నియోజకవర్గ ఇన్‌చార్జి   ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకవైపు టీడీపీ నేతలు ఆర్యవైశ్యులపై దాడులకు పాల్పడుతున్నారని, మరోవైపు అధికారులు, పోలీసులను అడ్డంపెట్టుకుని వేధిస్తున్నారని మండిపడ్డారు. దర్శి నియోజకవర్గంలో డీలర్‌షిప్‌ వదులుకోవాలని శ్రీరామ్‌ వెలుగొండ రామయ్యను బెదిరించడం దుర్మార్గమన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక వీడియో విడుదల చేశారు.

‘మొన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా పొదిలిలో వ్యాపారి అవినాష్, ఆయన తండ్రిపై అమానుషంగా దాడి చేసి కొట్టారు. నేడు దర్శి నియోజకవర్గంలోని గంగదేవిపల్లిలో దశాబ్దకాలంగా రేషన్‌ డిపో నిర్వహిస్తున్న శ్రీరామ్‌ వెలుగొండ రామయ్యపై వేధింపులకు పాల్పడ్డారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డీలర్‌షిప్‌ వదులుకోవాలని శ్రీరామ్‌ వెలుగొండ రామయ్యను బెదిరించారు. లేకపోతే ఆయన కుమారుడిని కిడ్నాప్‌ చేస్తామని హెచ్చరించారు. వారి బెదిరింపులు భరించలేక శ్రీరామ్‌ వెలుగొండ రామయ్య ఇల్లు వదిలి వెళ్లి దేవస్థానంలో తలదాచుకున్నారు. టీడీపీ కూటమి నేతలకు పోలీసులు అండగా నిలుస్తున్నారు.’ అని వెలంపల్లి ఆగ్రహం వ్యక్తంచేశారు.  

బతకాలంటేనే భయపడుతున్న ఆర్యవైశ్యులు  
‘రాష్ట్రంలో రోజుకు ఒకచోట ఆర్యవైశ్యులపై దాడులు జరుగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యులకు రక్షణ లేదు. అసలు ఈ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులు బతకాలంటే భయపడుతున్నారు. వరుస దాడులపై ఆర్యవైశ్య సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఇంత ఘోరం జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వంలోని ఆర్యవైశ్య మంత్రి, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఎందుకని ప్రశి్నంచడం లేదు? పొదిలిలో ఆర్యవైశ్యులపై దాడి చేసిన ఎస్‌ఐపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరిచి ఆర్యవైశ్యులపై దాడులను అరికట్టాలి. లేకపో­తే రాష్ట్రవ్యాప్తంగా ఆర్యవైశ్యులమంతా కలిసి తిరుగుబాటు చేస్తాం’ అని వెలంపల్లి హెచ్చరించారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)