తిరుమలకు పొటెత్తిన భక్తులు.. అలిపిరి వద్ద ట్రాఫిక్‌ జామ్‌

Published on Thu, 12/25/2025 - 10:41

సాక్షి, తిరుపతి: తిరుమలకు భక్తులు పొటెత్తారు. వీకెండ్‌, వరుస సెలవులు ఉండటంతో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దీంతో, అలిపిరి టోల్‌ గేట్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. అలాగే, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి.

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తుల రాకతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో, శిలాతోరణం వరకు క్యూలైన్‌లో భక్తులు నిలిచిపోయారు. మరోవైపు.. అలిపిరి టోల్‌గేట్‌ వద్ద వాహనాల రద్దీ పెరిగింది. కిలోమీటర్‌ మేర వాహనాలు బారులు తీరాయి. దీంతో, శ్రీవారి భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. బుధవారం అర్ధరాత్రి వరకు  73,524 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,989 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.88 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 10 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.   

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)