Breaking News

అమలులోకి వీబీ జీ రామ్‌జీ పథకం

Published on Fri, 07/03/2026 - 03:30

సాక్షి ప్రతినిధి, తిరుపతి: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక వీబీ జీ రామ్‌ జీ పథకం ఏపీలో తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లి నుంచి గురువారం ప్రారంభమైంది.  తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌  ‘వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అజీవికా మిషన్‌’ ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి వచ్చిందని కేంద్ర మంత్రి ప్రకటించారు. ముక్కవారిపల్లి గ్రామంలో రూ.4.55 లక్షల వ్యయంతో ప్రతిపాదించిన మూడు పనులకు ముగ్గురు నేతలూ లాంఛనంగా శ్రీకారం చుట్టారు. 

సామాజిక వర్షపు నీటి సంరక్షణ కుంట, మ్యాజిక్‌ డ్రెయిన్, మొక్కల పెంపకం కార్యక్రమాలను వీబీ జీ రామ్‌ జీ మిషన్‌ కింద తొలుత చేపట్టారు. ఈ పథకం కింద స్థానిక లబ్దిదారులకు కేంద్రమంత్రి, సీఎం, డిప్యూటీ సీఎం కలిసి వీబీజీ రామ్‌ జీ జాబ్‌కార్డులను అందజేశారు. కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్‌ పాశ్వాన్‌ వీబీ జీ రామ్‌ జీ ప్రోత్సాహక గీతాన్ని ఆవిష్కరించారు. ఈ పథకం కింద సమాచార బుక్‌లెట్, కంపెండియం ఆఫ్‌ ఆర్టికల్స్‌ను డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ విడుదల చేశారు. వీబీజీ రామ్‌ జీ పోర్టల్‌ను నేతలు ప్రారంభించారు. అనంతరం  శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ ఏమన్నారంటే..  

ఏపీకి నేను మేనమామను.. 
దేశంలోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకే వీబీజీ రామ్‌ జీ కింద రూ.7.5 లక్షల కోట్లు వ్యయంచేయాలని నిర్ణయించాం. ఈ తొమ్మి­ది నెలల కాలానికి ఈ పథకం కింద ఏపీకి కేంద్రం నుంచి రూ.7,700 కోట్లు విడుదల చేస్తాం. నన్ను మధ్యప్రదేశ్‌లో అంతా మామాజీ అని పిలుస్తారు.. ఇప్పుడు ఏపీకి కూడా నేను మేనమామనే అయ్యా. ఏ మేనమామ ఖాళీ చేతులతో రాడు. ఏపీకి ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద 74,212 పక్కా ఇళ్లు, గ్రామీణ ప్రాంతాలను అనుసంధానించే రోడ్ల నిర్మాణానికి రూ.422 కోట్ల నిధులు ఇస్తాం. అలాగే, 2,16,250 మెట్రిక్‌ టన్నుల తోతాపురి మామిడిని మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీం కింద కేంద్రం కొనుగోలు చేస్తుంది.  

అమరావతిని ఆపడం ఎవరి తరం కాదు.. 
సీఎం చంద్రబాబు, పవన్‌ మాట్లాడుతూ.. ‘వీబీ జి రామ్‌జీ పథకం రాష్ట్రం నుంచి ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి రావడం చారిత్రాత్మకం. గతంలో ‘నరేగా’ కూడా రాయలసీమ నుంచే ప్రారంభమైంది. ఇప్పుడు కూడా వీబీజీ రామ్‌ జీ పథకం ఇక్కడి నుంచే ఆవిష్కృతమైంది. ఈ పథకంతో గ్రామాల రూపురేఖలు మారతాయి. పొలాలకు వెళ్లే డొంక రోడ్లు ఈ పథకం కింద నిర్మించవచ్చు. గాలేరు–నగరి నుంచి కోడూరుకు నీళ్లు తీసుకొస్తాం. ఇక అమరావతిని ఆపడం ఎవరి తరం కాదు. కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అడిగిన వెంటనే సమస్యల్ని పరిష్కరించారు. ఆయనకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతాం. కేంద్ర నిధుల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో మూడో స్థానంలో ఉంది.’ అని చెప్పారు.  

Videos

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం...నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)