Breaking News

గనుల శాఖలో మరో వింత!

Published on Sat, 11/02/2024 - 04:35

సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గనుల శాఖలో రకరకాల వింతలు చోటు చేసుకుంటున్నాయి. జూన్‌ నెలలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏపీఎండీసీలో ఇద్దరు దళిత ఉన్నతాధికారులను సెలవుపై పంపారు. గనుల శాఖ డైరెక్టర్, ఏపీఎండీసీ కార్యాలయాలను 45 రోజులపాటు అనధికారికంగా మూసివేశారు. రాష్ట్రంలో లీజు పొందిన గనులన్నింటినీ అనధికా­రికంగా నిలిపివేశారు.  పరిశ్రమను పూర్తిగా స్తంభింపజేశారు. గనుల యజమానులతో మామూళ్లకు ఒప్పందం కుదిరాకే కొన్నింటిని తెరవడానికి అంగీకరించారు. కొన్ని గనులు ఇప్పటికీ మూతపడే ఉన్నాయి. కొందరు అధికారులను కూడా గాల్లో పెట్టారు. 

ఆ తర్వాత బదిలీల్లో డబ్బులు గుంజి చాలామందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఇప్పుడు బదిలీల్లో పోస్టింగులు ఇచ్చిన 12 మంది అధికా­రు­లను సెలవుపై వెళ్లాలని ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలివ్వడం గనుల శాఖలో కలకలం రేపింది. కొత్త పోస్టింగుల్లో చేరి నెల తిరక్కుండానే వారిని సెలవుపై వెళ్లిపోవాలని చెప్పడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలు చెప్పినట్టల్లా చేశారనే ఆరోపణలు సృష్టించి మరీ వీరిని సెలవుపై వెళ్లాలని ఆదేశించారు. ఇలా బలవంతంగా సెలవుపై పంపుతున్న వారిలో ముగ్గురు డిప్యూటీ డైరెక్టర్లు, ఐదుగురు అసిస్టెంట్‌ డైరెక్టర్లు, నలుగురు ఇతర స్థాయి ఉద్యోగులు­న్నారు. 

సెలవుపై పంపే ఉద్దేశం ఉన్నప్పుడు బదిలీల్లో ఎందుకు పోస్టింగ్‌ ఇచ్చారో అర్థం కావడంలేదని ఉద్యోగులు అంటున్నారు. గనుల శాఖలో బదిలీలే అత్యంత రహస్యంగా చేపట్టారు. ముఖ్య నేత కుమారుడికి ప్రధాన అనుచరుడు, గనుల శాఖ మంత్రి ద్వారా ఈ బదిలీల్లో పెద్ద తంతే జరిగింది. కీలకమైన డీడీ, ఏడీ పోస్టులను వేలం వేసి భారీగా డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి. భారీ­గా డబ్బులిచ్చిన వారికే పోస్టింగ్‌లు ఇచ్చారు. బది­లీల జీవోలను అన్ని శాఖలు ప్రభుత్వ వెబ్‌సైట్‌­లో పెట్టినా గనుల శాఖ మాత్రం పెట్టకపోవడమే ఇందులో మతలబులకు అద్దం పడుతోంది.

ఆ తర్వా­­త కూడా బదిలీల జీవోను వెంటనే బయట­పెట్టలేదు. ఇంత చేసి పోస్టింగ్‌లు ఇచ్చిన వారిలో కొందరిపై ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ముద్ర వేసి సెల­వుపై వెళ్లిపో­వాలని ఆదేశించడం గమనార్హం. బ్లాక్‌­మె­యిల్‌ చేసి వారి నుంచి మరింతగా డబ్బులు దండుకోవడానికే ఇలా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)