నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
విజయవాడ–బెంగళూరు మధ్య వందేభారత్
Published on Tue, 11/11/2025 - 03:37
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి మరో వందేభారత్ రైలును రైల్వే శాఖ మంజూరు చేసింది. విజయవాడ–బెంగళూరు వందేభారత్ రైలు ఈ నెలాఖరుకు పట్టాలు ఎక్కనుంది. ఈ మేరకు రూట్ మ్యాప్, షెడ్యూల్ను రైల్వే శాఖ ఖరారు చేసింది. మంగళవారం మినహా మిగిలిన 6 రోజులు ప్రయాణించే ఈ రైలులో విజయవాడ నుంచి ఎస్ఎంవీటీ (బెంగళూరు) 9 గంటల్లో చేరుకోవచ్చు.
ఈ రైలుకు తెనాలి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కాటా్పడి, కృష్ణరాజపురంలో హాల్ట్లు కల్పించింది. మొత్తం 8 బోగీలు ఉండే ఈ రైలులో 7 ఏసీ చైర్కార్ బోగీలు, ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉంటాయి. ఈ రైలు (20711) విజయవాడలో ఉదయం 5.15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు బెంగళూరు చేరుతుంది. అలాగే, రైలు (20712) బెంగళూరులో మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి రాత్రి 11.45 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. కాగా, ఇప్పటికే ప్రారంభించిన విజయవాడ– చెన్నై సెంట్రల్ వందేభారత్ ఎక్స్ప్రెస్ను నరసాపురం వరకు పొడిగించారు. గుడివాడ, భీమవరంలో హాల్ట్లు కల్పించారు.
Tags : 1