Breaking News

చంద్రబాబు వ్యూహం ప్రకారమే గన్నవరం అల్లర్లు 

Published on Fri, 02/24/2023 - 04:15

గన్నవరం:  ప్రశాంతంగా ఉన్న గన్నవరంలో జరిగిన అల్లర్ల వెనుక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్యూహం ఉందని స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ చెప్పారు. పట్టాభి నేతృత్వంలో సంఘ విద్రోహ శక్తులను ఇక్కడికి పంపించి అల్లర్లకు కారణమయ్యారని తెలిపారు. వంశీమోహన్‌ గురువారం గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. గన్నవరంలో గొడవలు సృష్టించిన వారిలో విజయవాడ ఈస్ట్, సెంట్రల్, వెస్ట్, పెనమలూరు నియోజకవర్గాలకు చెందిన  60 మంది వరకు టీడీపీ గూండాలు ఉన్నారని చెప్పారు.

వీరందరూ గన్నవరంలో విధ్వంసం  సృష్టించేందుకు ప్రయత్నించి విఫలం కావడంతో చంద్రబాబుకు, టీడీపీకి గట్టి షాక్‌ తగిలిందన్నారు. ఇక్కడ జరిగిన గొడవలకు సంబంధించి కేసుల నమోదుపై టీడీపీ, ఎల్లో మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తప్పు­పట్టారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగినట్లు చెబుతున్న ఆ పార్టీ నేతలు బుధవారం రాత్రి వరకు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు . ఎస్పీ జాషువా మీడియాతో మాట్లాడిన తర్వాత మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావును వెంట పెట్టుకుని వచ్చి ఫిర్యాదులు చేశారని తెలిపారు.

అధికారంలో ఉన్నప్పుడు కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌పై ఏమీ చేయలేని చంద్రబాబు ఇప్పుడు ప్రపంచం తలక్రిందులైనట్లు చెబుతుండటం సిగ్గుచేటన్నారు. లేస్తే మగాడిని కాదంటూ లోకేశ్‌ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. టీడీపీ లేదు, బొక్కా లేదన్న అచ్చెన్నాయుడు ఓ ఐపీఎస్‌ అధికారిణితో అసభ్యకరంగా ప్రవర్తించి చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారని చెప్పారు. అచ్చెన్నాయుడు ఇంకా మాట్లాడితే చిట్టా మొత్తం విప్పుతానని అన్నారు. గతేడాది కోవిడ్‌ కారణంగా ఐఎస్‌బీ ఒక సెమిస్టర్‌ రాయలేదని, దానిని పూర్తి చేసేందుకు మొహాలీ వెళ్తున్నట్లు తెలిపారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)