Breaking News

టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నిక.. కూటమి నేతల్లో విభేదాలు

Published on Sat, 02/08/2025 - 07:26

సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేతల మధ్య విభేదాలు గుప్పుమంటున్నాయి. పార్టీలకు సంబంధంలేకుండా జరిగే ఈ ఎన్నికల్లోనూ టీడీపీ, బీజేపీ నేతలు చెరో అభ్యర్థికి మద్దతు ప్రకటించడం కూటమి శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది. ఏపీటీ­ఎఫ్‌కు చెందిన పాకలపాటి రఘువర్మ నామినేషన్‌ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి పాల్గొన్నారు.

కూటమి పార్టీలన్నీ రఘువర్మకు మద్దతుగా నిలుస్తున్నట్లు మీడియా ముందు ఎమ్మె­ల్సీ చిరంజీవి ప్రకటించారు. ఆయనను గెలిపించడానికి టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు కృషిచే­యాలని పిలుపునిచ్చారు. కానీ, శుక్రవారం పీఆర్‌­టీయూకు చెందిన గాదె శ్రీనివాసుల­నాయు­డు నామినేషన్‌ వేశారు. ఈయనకు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ మద్దతు తెలిపారు.

శ్రీనివాసులనాయుడికే బీజేపీ మద్దతు..
మరోవైపు.. శ్రీనివాసులనాయుడు నామినేషన్‌ సమర్పించిన అనంతరం మాధవ్‌ ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. తమ మద్దతు శ్రీనివాసు­లనాయుడికే ఉంటుందని తేల్చిచెప్పారు. ఈయన విజయానికి ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు. అలాగే, మరో అభ్యర్థికి కూటమి మద్దతు ఉందని ఒకరు ప్రకటించడాన్ని ఖండిస్తున్నామని.. టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవిపై పరోక్షంగా విమర్శలు చేశారు. దీనిపై కూటమి ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయలేదని ఆయన స్పష్టంచేశారు.  

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు