Breaking News

పాఠశాల విద్యాశాఖ.. అత్యవసర శాఖనా?

Published on Mon, 12/08/2025 - 08:06

సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖ వెకేషన్‌ డిపార్ట్‌మెంట్‌గా ఉంటూ, మానసిక శాస్త్రం ప్రకారం నేర్చుకొనేవారికి, చదువు చెప్పే వారికి విశ్రాంతి అవసరమని, కానీ దానికి భిన్నంగా పాఠశాల విద్యాశాఖను అత్యవసర శాఖగా మార్చేశారని యూటీఎఫ్‌ ఆక్షేపించింది. ఉపాధ్యాయులను వేధిస్తూ మానసిక ఒత్తిడికి గురి చేస్తోందని యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కేఎస్‌ఎస్‌ ప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈమేరకు ఆదివారం విజయవాడలో జరిగిన యూటీఎఫ్‌ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యాశాఖను నాన్‌ వెకేషన్‌ శాఖగా మార్చమని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ కమిషనర్‌కు గతంలో విన్నవిస్తే సాధ్యం కాదని సమాధానం ఇచ్చారని, స్వేచ్ఛాయుత వాతావరణంలో బోధించాల్సిన ఉపాధ్యాయులను రోజుకో స్కీం పేరుతో ఒత్తిడి చేస్తూ శని, ఆదివారాలు, పండుగ సెలవులలో పని చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. 

10వ తరగతి బోధించే ఉపాధ్యాయులకు సెలవులు ఇవ్వకుండా ఇబ్బందికి గురిచేస్తున్నారని విమర్శించారు. 100% ఉత్తీర్ణత పేరుతో ప్రతిరోజు సాయంత్రం పరీక్ష నిర్వహించి మార్కులు అప్‌లోడ్‌ చేయాలని ఒత్తిడి చేయడంపై వారు  ఆందోళన వ్యక్తం చేశారు. 

గంజాయికి బానిసలు కాకుండా చర్యలు తీసుకోవాలి  
విద్యార్థులు గంజాయికి బానిసలుగా మారి జీవితాలను బలిచేసుకుంటున్న ఘటనలపై యూటీఎఫ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గంజాయిని విక్రయించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కేఎస్‌ఎస్‌ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)