Breaking News

యూరియా కోసం బారులు

Published on Tue, 12/09/2025 - 06:09

బిక్కవోలు/తిరుపతి రూరల్‌: రైతన్నను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని సొసైటీ వద్ద సోమవారం రైతులు యూరియా కోసం బారులు తీరారు. బిక్కవోలు సొసైటీ పరిధిలో 378 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం. తొలి విడతగా 50 మెట్రిక్‌ టన్నులు మాత్రమే తీసుకువచ్చారు. యూరియా లేకపోతే ఇబ్బంది పడక తప్పుదు అని రైతులు సొసైటీ వద్ద బారులు తీరారు. అయితే ఒక రైతుకు రెండు బస్తాలకు మించి ఇవ్వకపోవడంతో క్యూలో తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసుల సమక్షంలో యూరియాను అందించారు.  

తిరుపతిలో... తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో మండలంలోని కె.వడ్డేపల్లి రైతు భరోసా కేంద్రంలో యూరియా బస్తాల కోసం సోమవారం రైతులు పెద్ద ఎత్తున తరలిరావడంతో తోపులాట చోటుచేసుకుంది. దీంతో అధికారులు కొంత సమయం సరఫరా నిలిపివేయడంతో అన్నదాతలు క్యూ కట్టారు. పాకాల 
మండలంలోని గాదంకి, ఆదెనపల్లి, కావలివారి పల్లి, కె.వడ్డేపల్లి పంచాయతీలకు చెందిన 300మంది రైతులకు అధికారులు టోకెన్లను మంజూరు చేశారు. ఈ విషయం తెలుసుకుని మరికొంత మంది రైతులు అక్కడకు చేరుకున్నారు. 

టోకెన్లు ఉన్న వారు మాత్రమే రావాలని, మిగతా వారికి మరికొన్ని రోజుల్లో యూరియా ఇస్తామని అధికారులు చెప్పడంతో ఒకింత గందరగోళం చోటు చేసుకుంది. అనంతరం టోకెన్లున్న రైతులు యూరియా తీసుకెళ్లారు. అయితే టీడీపీ నేతలు తమకు కావాల్సిన వారికి ముందుగానే టోకెన్లు ఇచ్చి యూరియాను దారి మళ్లించారని, అందుకే తమకు ఈ కష్టాలని పలువురు రైతులు వ్యాఖ్యానించారు. 

#

Tags : 1

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)