Breaking News

పింఛన్‌ హామీ తప్పెన్‌

Published on Wed, 07/03/2024 - 12:09

దివ్యాంగులకు పెంచిన పింఛన్‌ రూ.6 వేలతో పాటు మూడు నెలలకు రూ.3 వేల చొప్పున బకాయి మొత్తం రూ.9 వేలు కలిపి రూ.15 వేలు చెల్లిస్తాం. 
– జూన్‌ 30న రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు  

ఆత్మకూరు: కూటమి ప్రభుత్వం పింఛన్లపై మాట తప్పింది. గత మూడు నెలల బకాయిలతో కలిపి ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. అయితే వృద్ధాప్యం, వితంతు, ఒంటరి మహిళల పింఛన్ల బకాయిలు ఇచ్చిన చంద్రబాబు.. దివ్యాంగుల బకాయిలు  ఎగనామం పెట్టారని దివ్యాంగులు వాపోతున్నారు. ఆత్మకూరులోని టెక్కేవీధికి చెందిన, రెండు దశాబ్దాలుగా మంచానికే పరిమితమైన దివ్యాంగురాలు షేక్‌ షాహీనా (32)కు కేవలం రూ.6 వేలు మాత్రమే చెల్లించారు. 

ఆమెకు మందులకే నెలకు రూ.7 వేలకు పైగా అవుతోందని ఆమె తల్లిదండ్రులు రజియా, అహమ్మద్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని బోయలచిరివెళ్లకు చెందిన మరో దివ్యాంగురాలు రమాదేవి మంచానికే పరిమితమైంది. ఏళ్ల తరబడి ఇతరులపై ఆధారపడి జీవిస్తున్న ఆమెకు నెలకు మందులకే రూ.5 వేలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు ఆమె తండ్రి రాఘవయ్య తెలిపారు. 

దివ్యాంగుల్లో ఆశలు రేకెత్తించి, ఇచ్చిన మాట తప్పిన కూటమి ప్రభుత్వం పింఛన్‌ పంపిణీ సమయంలో వారి చేతిలో రూ.6 వేలు మాత్రమే పెట్టడంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు మంచానికి పరిమితమైన వారికి, డయాలసిస్‌ బాధితులకు సైతం పెంచిన మొత్తం బకాయిలు చెల్లించలేదని, బాబుకు మాట తప్పడం పరిపాటేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. బాబును నమ్మి మోసపోయామని పలువురు బాధితులు వాపోతున్నారు.   

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)