Breaking News

ఇదేం సాయం?.. చంద్రబాబు అట్టర్ ఫ్లాప్‌

Published on Tue, 07/23/2024 - 12:04

ఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మరోసారి మొండిచేయి ఎదురైంది. ఎన్డీఏ కూటమిలో ప్రధాన మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు.. ప్రత్యేక హోదా అంశంలో కేంద్రాన్ని ఒప్పించడంలో విఫలమయ్యారు. అలాగే భారీగా నిధులు రాబట్టలేకపోయారు. సరికదా.. రాష్ట్ర అభివృద్ధి కోసం కనీసం స్పష్టమైన హామీ ప్రకటనలు కూడా చేయించులేకపోయారు.  

సుమారు పదేళ్ల తర్వాత తెరపైకి ఏపీ విభజన అంశం వచ్చింది. అయితే ప్రత్యేక హోదా అనే పదాన్ని ప్రస్తావించకుండానే ప్రత్యేక సాయం ప్రకటన చేసింది కేంద్రం. ఈ క్రమంలో విభజన చట్టానికి కేంద్రం కట్టుబడి ఉందని చెబుతూ.. ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.15వేల కోట్ల సాయం అందిస్తామని, అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామని.. అది వివిధ ఏజెన్సీల ద్వారా అప్పుల రూపేణా అని ఒక విడ్డూరమైన ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. 

అలాగే.. కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు అందించే సాయం మీదా ఆమె స్పష్టత ప్రకటన చేయలేదు. ఇక.. ప్రత్యేక ప్యాకేజీ అంశం తెర మీదకు తెచ్చిన కేంద్రం.. ఈసారి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు అంటూ కొత్త రాగం అందుకుంది. అదే సమయంలో టీడీపీ తర్వాత కూటమిలో ప్రాధాన్యత ఉన్న బీహార్‌ మాత్రం భారీగా నిధులు సాధించుకుంది. మొత్తంగా కేంద్రంలో చక్రం తిప్పేలా ఏపీ ప్రజలు చంద్రబాబుకి మెజారిటీ ఇచ్చినప్పటికీ.. కేంద్రం కంటి తుడుపు ప్రకటన ద్వారా నిధులు రాబట్టడంలో అట్టర్‌ప్లాఫ్‌ అయ్యారు. మరోవైపు..   

జగన్‌ చొరవతోనే.. 
కేంద్రం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పథకాలను ఆదర్శంగా తీసుకుందా? అనే చర్చ మొదలైంది. జగన్‌ మానసపుత్రికలైన డీబీటీ పథకాల ప్రస్తావనే అందుకు కారణం. ఉన్నత విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు రూ.10 లక్షల విద్యారుణాలు ఇస్తామని బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. దేశీయంగా చదువుకునే లక్ష మందికి ఏటా రుణ సదుపాయం కల్పిస్తామని తెలిపింది. ఇక.. వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తి నోడ్‌.. విశాఖపట్నం, చెన్నై ఇండస్ట్రీయల్‌ కారిడార్‌, కర్నూల్‌ జిల్లా ఓర్వకల్లు నోడ్‌ హైదరాబాద్‌-బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌లకు బడ్జెట్‌ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు.  వైఎస్‌ జగన్‌ హయాంలోనే ఈ కారిడార్‌ పనులు మొదలైన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: జగన్‌ పాలనలో పారిశ్రామిక దూకుడు!

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)