Breaking News

విద్యపై ప్రకృతి ప్రకోపం

Published on Mon, 01/27/2025 - 05:05

సాక్షి, అమరావతి: ప్రకృతి వైపరీత్యాలు విద్యా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వేడి గాలులు, తుపానులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా పాఠశాల విద్యకు అంతరాయం కలుగుతోంది. ఈ విషయం యునైటెడ్‌ నేషన్స్‌ చిల్డ్రన్స్‌ ఫండ్స్‌ (యునిసెఫ్‌) అధ్యయనంలో వెల్లడైంది. గతేడాది ప్రకృతి విపత్తులతో 85 దేశాల్లో 242 మిలియన్ల మంది విద్యార్థులు ప్రీ–ప్రైమరీ నుంచి అప్పర్‌ సెకండరీ వరకూ విద్యలో అంతరాయాన్ని ఎదుర్కొన్నట్టు పేర్కొంది. 

ప్రతి ఏడుగురు విద్యార్థుల్లో ఒకరి పాఠశాల విద్యపై వాతావరణ సంక్షోభం ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు స్పష్టం చేసింది. విపత్తుల కారణంగా విద్యలో అంతరాయాన్ని ఎదుర్కొంటున్న దేశాల్లో దిగువ, మధ్య ఆదాయ దేశాలే అధికంగా ఉన్నట్టు వెల్లడైంది. గతేడాది విద్య అంతరాయానికి గురైన 242 మిలియన్ల మంది విద్యార్థుల్లో 74 శాతం మంది అల్పాదాయ దేశాలకు చెందిన వారున్నారు.  

భారత్‌లోనూ 5 కోట్ల మంది 
2024 విద్య అంతరాయానికి తీవ్రమైన వేడిగాలులు ప్రధాన కారణంగా నిలిచాయని చెప్పవచ్చు. తీవ్రమైన వేడిగాలుల కారణంగా గతేడాది భారత్‌లో 5 కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారు. వేడిగాలుల కారణంగా భారత్‌తో పాటు బంగ్లాదేశ్, కంబోడియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌ వంటి దేశాలు గణనీయమైన ప్రభావాలను చవిచూశాయి. ఈ దేశాల్లో కనీసం 118 మిలియన్ల మంది పిల్లలకు చదువుల్లో అంతరాయం ఎదురైంది. ఈ కారణంతో ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పడినవారు 171 మిలియన్ల మంది ఉంటారని అంచనా వేశారు. 

ఇక ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్‌లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా అత్యంత తరచుగా విద్య అంతరాయాలు సంభవించాయి. 18 దేశాలలో తరగతులు నిలిపేశారు. తూర్పు ఆసియా, పసిఫిక్‌ దేశాలలో 16 మిలియన్ల మంది పిల్లలపై ప్రభావం పడింది. ఆఫ్రికాలో 107 మిలియన్ల మంది పిల్లలు ఇప్పటికే పాఠశాలలకు దూరంగా ఉండగా.. వీరిలో 20 మిలియన్ల మంది వాతావరణ సంక్షోభం కారణంగానే పాఠశాలల నుంచి తప్పుకున్నట్టు స్పష్టమైంది. 2050–2059 మధ్య తీవ్ర వాతావరణ సంక్షోభాలను ప్రపంచ దేశాలు చవిచూడనున్నాయని అధ్యయన నివేదిక వెల్లడించింది. 

26వ స్థానంలో భారత్‌ 
ప్రకృతి వైపరీత్యాల ద్వారా పిల్లలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ప్రమాదాలపై యునిసెఫ్‌ గతంలోనే అధ్యయనం చేసింది. 163 దేశాలకు చిల్డ్రన్స్‌ క్లైమేట్‌ రిస్క్‌ ఇండెక్స్‌ (సీసీఆర్‌ఐ) పేరిట స్కోరింగ్‌ ఇచ్చింది. ఇందులో భారత్‌కు 26 స్థానం దక్కింది. పాకిస్తాన్‌ 14, బంగ్లాదేశ్, 15, ఆఫ్ఘనిస్తాన్‌ 25 స్థానాల్లో ఉన్నాయి.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)