Breaking News

పద్దెనిమిదికి ముందే పెళ్లి! 

Published on Sun, 02/12/2023 - 03:11

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేసిన కోవిడ్‌... ప్రతి మనిషిని ఆరోగ్యపరంగా, ఆర్థికం గా కుంగదీసింది. ఉపాధినీ దెబ్బతీసింది. ఆ మహమ్మారి వ్యాప్తి తగ్గినా... దాని ప్రభా­వం మాత్రం సమాజంపై వివిధ రూపాల్లో కొనసాగుతూనే ఉంది. మనుషుల ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేస్తూనే ఉంది.

కోవిడ్‌ చేసిన గాయం కారణంగా అభద్రతాభావానికి గురవుతు­న్న తల్లి­దం­డ్రులు తమ కుమార్తెలకు వయసుతో నిమిత్తం లేకుండా వెంటనే పెళ్లిళ్లు చేయాలనే భావనలోకి వచ్చారని యూనిసెఫ్‌ నిర్వహించిన సర్వేలో తేలింది. అందువల్లే దేశవ్యాప్తంగా 2022లో జరిగిన పెళ్లిళ్లలో 25.3శాతం మంది అమ్మాయిలు 18 ఏళ్లు నిం­డనివారే ఉన్నారని వెల్లడించింది. ఇందుకు కొన్ని కారణాలను ఈ సర్వేలో గుర్తించినట్లు తెలిపింది.  

మొదటి స్థానంలో పశ్చిమబెంగాల్‌ 
పద్దెనిమిదేళ్ల వయసు నిండకముందే అమ్మాయిలకు వివాహాలు చేస్తున్న రాష్ట్రాల్లో పశి్చమ బెంగాల్‌ తొలి స్థానంలో నిలిచింది. అక్కడ 41.6 శాతం బాల్యవివాహాలు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో బిహార్‌ (40.8 శాతం), త్రిపుర (40.1శాతం), జార్ఖండ్‌ (32.2 శాతం), అస్సాం(31.8 శాతం), ఆంధ్రప్రదేశ్‌ (29.3 శాతం) ఉన్నాయి. జమ్మూ–కశీ్మర్‌లో అత్యంత తక్కువగా 4.5 శాతం, కేరళలో 6.3 శాతం చొప్పున 18 ఏళ్లలోపు బాలికలకు వివాహాలు చేసినట్లు యూనిసెఫ్‌ గుర్తించింది.  

రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో బాల్యవివాహాల పరిస్థితి  
మన రాష్ట్రంలో అత్యధికంగా ఉమ్మడి అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో 37.3 శాతం చొప్పున 18 ఏళ్లలోపు బాలికలకు వివాహాలు చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత స్థానాల్లో ఉమ్మడి కర్నూలు (36.9 శాతం), గుంటూరు (35.4 శాతం), విజయనగరం (33.7 శాతం), చిత్తూరు (28.1 శాతం), తూర్పుగోదావరి (26.0 శాతం), వైఎస్సార్‌ కడప (25.6 శాతం), శ్రీకాకుళం (25.4 శాతం), విశాఖపట్నం (25.4 శాతం), కృష్ణా (25.3 శాతం), నెల్లూరు (23.8 శాతం), పశి్చమగోదావరి (22.1 శాతం) చొప్పున 18 ఏళ్లలోపు బాలికలకు 2022లో వివాహాలు చేసినట్లు యూనిసెఫ్‌ వెల్లడించింది.   

ప్రధాన కారణాలు ఇవీ... 
► కోవిడ్‌ కారణంగా దాదాపు రెండేళ్లు పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. పది, ఇంటర్‌ చదువుతున్నవారు ఆన్‌లైన్‌ తరగతుల కారణంగా చదువులో రాణించలేకపోయా­రు. ఫలితంగా డ్రాపవుట్స్‌ పెరిగాయి.  
► చదువు మధ్యలో ఆపేసిన ఆడపిల్లలు ఇంటి వద్దే ఉంటున్నారు.  
► కరోనా రాకముందు వలస వెళ్లిన కుటుంబాలు తిరిగి సొంత గ్రా­మా­లకు వచ్చేశాయి. నిరుద్యోగిత పెర­గ­డంవల్ల ఆరి్థకంగా ఇబ్బందులు ఎక్కువయ్యాయి.
► అందువల్ల అభద్రతాభావంతో పెళ్లీడు రాకపోయినా ఆడపిల్లలకు వివాహాలు చేస్తే బాధ్యత తీరిపోతుందని ఎక్కు­వ మంది తల్లిదండ్రులు భావిస్తున్నట్లు సర్వేలో గుర్తించినట్లు యూనిసెఫ్‌ ప్రకటించింది.   

Videos

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)