Breaking News

ఆ 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయి!?

Published on Sat, 06/15/2024 - 05:20

సాక్షి, రాజమహేంద్రవరం: దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 20 లక్షల ఈవీఎంలు కనపడకుండా పోయాయంటూ కమ్యూనిస్టులు, ప్రజల నుంచి వస్తున్న ఆరోపణలపై సీఎం చంద్రబాబునాయుడు స్పందించాల­ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల నిమిత్తం 60 లక్షల ఈవీఎంలు దిగుమతి చేసుకుంటే.. వీటిలో 40 లక్షలు వినియోగించారని, మిగిలిన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడో ఒకచోట ఉండాలి కదా అని ప్రశ్నించారు. 

ఈవీఎంల వినియోగం విషయమై సమాచార హక్కు చట్టం ద్వారా ఎన్నికల కమిషన్‌ను కోరితే.. తమకేం తెలీదని.. ప్రభుత్వం తమకు ఇచ్చిన ఈవీఎంలనే ఉపయోగించామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఉండవల్లి అన్నారు. రాజమహేంద్రవరంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇదే విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్‌­ను అడగాలంటూ తప్పించుకుంటోందని ఆరోపించారు. ఓ కమ్యునిస్టు నేత సైతం ఇదే అనుమానం వ్యక్తంచేశారన్నారు. 

ఈవీఎంల గోల్‌మాల్‌ అంశాన్ని ఒక కమ్యూనిస్టు నాయకుడు తన దృష్టికి తీసుకొచ్చారని ఉండవల్లి చెప్పారు. గతంలో ఈవీఎంల పనితీరుపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తంచేసినందున ఇప్పుడు ఈవీఎంల గోల్‌మాల్‌పై విచారణకు ఆయన డిమాండ్‌ చేయాలని కోరారు. తాము వేసిన ఓటు ఎవరికి వెళ్లిందోననే అపోహ ప్రస్తుతం నెలకొందని, ప్రజల్లో అటువంటి అనుమానం రావడం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 

దీనిపై చంద్రబాబు దృష్టిపెట్టాలని ఉండవల్లి సూచించారు. కేంద్రంలో ఎన్డీయే, ఇండియా కూటములకు ఓట్ల తేడా కేవలం 1.9 శాతం మాత్రమేనన్నారు. అహంకారం పెరిగిపోయిందని ప్రధాని మోదీని ఉద్దేశించి ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ అని ఉండవచ్చన్నారు.

వైఎస్సార్‌సీపీకి మళ్లీ మంచి రోజులు..
ఇక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పనైపోయిందనుకోవద్దని.. ఓటమి పాలైన ఆ పార్టీ నాయకులు నిరాశ చెందాల్సిన అవసరంలేదన్నారు. 11 స్థానాలే వచ్చినా ఆ పార్టీ ఓట్ల శాతం బాగుందని.. వారికి మళ్లీ మంచి రోజులు రావచ్చని ఉండవల్లి చెప్పారు. గతంలో ఓటమి చెందిన చంద్రబాబు ప్రస్తుత గెలుపే దీనికి నిదర్శనమన్నారు. ఇదే తరహా పరిస్థితులు తమిళనాడు రాజకీయాల్లో సైతం గతంలో చోటుచేసుకున్నాయని చెప్పారు. 

తమిళనాడులో 1989లో ఎంజీ రామచంద్రన్‌ మరణానంతరం జరి­గిన ఎన్నికల్లో కరుణానిధి పార్టీకి 169, జయలలిత పార్టీకి 30 సీట్లు వచ్చాయని.. ఆ తర్వాత 1991­లో జరి­గిన ఎన్నికల్లో జయలలితకు 225, కరుణానిధికి 7 సీట్లు మాత్రమే వచ్చాయని గుర్తుచేశా­రు. అయినప్పటికీ ప్రతిపక్ష పాత్ర పోషించారని చెప్పారు. అలా­గే, 1996లో కరుణానిధి 221 సీట్లు సాధించగా.. జయలలిత నాలుగు స్థానా­లకే పరిమి­త­మయ్యా­రన్నారు. 

మళ్లీ 2011 ఎన్ని­కల్లో జయలలిత ఏకంగా 203 సీట్లు సాధించార­ని చెప్పారు. దీని­నిబట్టి చూస్తే రాజకీయాల్లో నిస్సత్తువ ఉండకూడద­ని ఉండవల్లి అన్నారు. వైఎస్సార్‌సీపీ అసెంబ్లీలో ప్రతి­పక్ష పాత్ర సమర్థవంతంగా పోషించాలని సూచించారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం బాబు పోరాడాలి..
మరోవైపు.. ఎన్డీయే ప్రభుత్వం చంద్రబాబుపై ఆధారపడి ఉందని, ఆయన ఢిల్లీలో తన పలుకుబడి ఉపయోగించి రాష్ట్రాభివృద్ధికి, రాష్ట్రానికి అందాల్సిన నిధుల సాధనకు కృషిచేయాలని ఉండవల్లి సూచించారు. రాష్ట్ర విభజన హామీ మేరకు ఏపీకి రూ.1.42 లక్షల కోట్లలో 50 శాతం ఆస్తులు రావాలని, వాటిని సాధించుకునేందుకు పోరాడాలని సూచించారు.

రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ సందర్భంగా 2014లో పార్లమెంట్‌లో ఏం జరిగిందో తెలుసుకుని, ఇప్పుడు బాబు  చర్చకు డిమాండ్‌ చేయాలన్నారు. అలా­గే, త్వరలో జరగబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో దీనిపై నోటీసు ఇప్పించాలన్నారు. వివాదా­స్పద ఎలక్టోరల్‌ బాండ్లపై సైతం చర్చ జరగా­లని ఆకాంక్షించారు. ఇక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును చంద్రబాబు ప్రభుత్వమే సీబీఐకి అప్పగించే అవకాశం ఉందని ఉండవల్లి చెప్పారు. 

జగన్‌ జైలుకెళ్లే అవకాశం ఉండదు..
అక్రమాస్తుల కేసులో జగన్‌ మళ్లీ జైలుకెళ్లే అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి అన్ని చార్జిషీట్లూ పూర్తయ్యాయని చెప్పారు. ఇక కమ్మ, కాపులది డెడ్లీ కాంబినేషన్‌ అని.. కసి, పట్టుదలవల్లే చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చారని, ఆయనపై జగన్‌ కక్షసాధింపు చర్యలు చేపట్టారని ప్రజలు నమ్మారని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. 

వైఎస్సార్‌సీపీ ఓటమికి మద్యం పాలసీ కూడా ఒక కారణం కావచ్చునన్నారు. ఆ పార్టీ నేతలు బూతులు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. అలాంటి వారివల్లే కొంతమంది వైఎస్సార్‌సీపీకి దూరమయ్యారని చెప్పారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)