సీఎం జగన్‌తో యూఏఈ రాయబారి సమావేశం.. ఏపీలో పెట్టుబడులపై చర్చ

Published on Mon, 05/01/2023 - 18:54

సాక్షి, తాడేపల్లి: క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు భారత్‌లో యూఏఈ రాయబారి అబ్ధుల్‌ నాసర్‌ అల్షాలి. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని అబ్దుల్ నాసర్‌కు సీఎం హామీ ఇ‍చ్చారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను యూఏఈ రాయబారికి సీఎం వివరించారు.

సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఫుడ్‌ పార్క్‌లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్స్, టూరిజం, హాస్పిటాలిటీ, గ్రీన్‌ హైడ్రోజన్, పోర్ట్‌లు, పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌లు, మౌలిక సదుపాయాల కల్పన వంటి వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి యూఏఈ రాయబారి తెలిపారు. ఏపీని పెట్టుబడులకు లీడ్‌ స్టేట్‌గా పరిగణిస్తున్నట్లు చెప్పారు.

ఇప్పటికే పెట్టుబడుల సదస్సులో చర్చించిన అంశాలపై మున్ముందు ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ జరిగింది.  ఈ భేటీలో సీఎం స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ పూనం మాలకొండయ్య, యూఏఈ రాయబార కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.
చదవండి: గర్వంగా ఉంది: సాత్విక్‌- చిరాగ్‌లకు సీఎం జగన్‌ అభినందనలు

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)