Breaking News

సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ రెడ్డికి ఊరట

Published on Mon, 12/02/2024 - 13:24

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ రెడ్డికి ఊరట లబించింది. భార్గవరెడ్డికి రెండు వారాలపాటు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈలోగా ఏపీ హైకోర్టును ఆశ్రయించి ఈ కేసులో వాదనలు వినిపించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కేసులోని మెరిట్ ఆధారంగా హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని సుప్రీం సూచించింది.

కాగా టీడీపీ  ప్రభుత్వం అక్రమ కేసులపై సజ్జల భార్గవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం నేడు విచారణ జరిపింది. సజ్జల భార్గవ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. 

వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్చార్జి సజ్జల భార్గవపై  టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని తెలిపారు.  ఆర్గనైజ్డ్ క్రైమ్‌కు   పాల్పడ్డారని బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 111 కింద కేసులు బనాయించి వేధిస్తోందని కోర్టుకు తెలిపారు. అయితే ఈ కేసుపై రెండు వారాల్లో ఏపీ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం తెలిపింది. అప్పటి వరకు ఆయన్ను అరెస్టు చేయకుండా ఉండాలని పేర్కొంది.

సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ రెడ్డికి ఊరట ...

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)