Breaking News

సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసు.. మరో ఇద్దరికి రిమాండ్

Published on Wed, 07/01/2026 - 14:47

సాక్షి, విజయవాడ: సాయికృష్ణ లాకప్ డెత్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కానిస్టేబుళ్లు సాంబయ్య, బాబురావులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు గన్నవరం జైలుకు సాంబయ్య, ఆవనిగడ్డ జైలుకు బాబురావును తరలించారు.కాగా రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడయ్యాయి.

సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో ఆధారాలు మాయం చేయడంలో వీరిద్దరు కీలకంగా వ్యవహారించారని తేలింది. కృష్ణలంక పీఎస్‌ సీసీటీవీ హర్డ్‌ డిస్క్‌ను మార్చేసినట్లు అధికారులు గుర్తించారు. సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో కృష్ణలంక పీఎస్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు బాబురావు, సాంబశివరావులను సిట్ అధికారులు నిందితులుగా చేర్చి విచారించగా  ఆధారాలు మాయం చేయడంలో వీరు కీలక పాత్ర పోషించారని తేలింది. దీంతో వీరిని కోర్టులో హాజరుపరచగా  కోర్టు వారికి  14 రోజుల రిమాండ్ విధించింది. 

అంతకుముందు సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయిన హెడ్‌ కానిస్టేబుళ్లు పోతర్లంక అశోక్‌ కుమార్‌ ఏ2,జంగం నాని ఏ​‍​3లకు ఇదివరకే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.కాగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గాదెకృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో సిట్‌ విచారణ కొనసాగుతుంది. నెలరొజుల కిందట అమెరికా వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చిన స్థానిక ఆర్‌ఎంపీని నిన్న (మంగళవారం) సిట్‌ విచారించింది.

హెడ్‌ కానిస్టేబుళ్లు అశోక్‌, నానిలు పిలిస్తేనే అక్కడికి వెళ్లి వైద్యం చేశానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. కాగా వైద్యం చేసే సమయంలో సాయికృష్ణ శరీరంపై ఎక్కడెక్కడ గాయాలున్నాయని ఆరాతీసి ఆయన స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారు. ఆర్‌ఎంపీ విచారణలో మరిన్ని కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)