Breaking News

నడిరోడ్డుపై ఇద్దరు కానిస్టేబుళ్ల ఘర్షణ

Published on Thu, 09/04/2025 - 05:44

అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడ సెంట్రల్‌)/­లబ్బీపేట (విజయవాడ తూర్పు) : మహిళతో ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ నడిరోడ్డుపై గొడవపడిన ఘటన విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌­స్టేషన్‌ పరిధిలో బుధవారం తెల్లవారు­జామున జరిగింది. వీరిని అడ్డుకోబోయిన డ్యూటీ కానిస్టేబుల్‌తో ఆ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఘర్షణ పడ్డాడు. అంతేకాక.. డ్యూటీ కానిస్టేబుల్‌పై ఆ మహిళ పిడిగుద్దులు గుద్దింది. దీంతో.. ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసు కమిషనర్‌ సస్పెండ్‌ చేశా­రు. 

వివరాలివీ.. నాలుగో పట్టణ ట్రాఫిక్‌ పోలీ­స్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ నాయక్‌ సింగ్‌నగర్‌ డాబాకొట్లు సెంట­ర్‌ సమీపంలో ఉంటున్నాడు. మధురానగర్‌ పసుప­ తోటకు చెందిన ఓ మహిళతో బుధవారం తెల్లవారు­జామున మూడు గంటల ప్రాంతంలో సింగ్‌న­గర్‌­లో గొడవపడ్డారు. ఈ విషయం తెలు­సు­కున్న సింగ్‌­నగర్‌ డ్యూటీ కానిస్టేబుల్‌ కోటేశ్వర­రావు వీరిని అడ్డుకుని రోడ్లపై గొడవలేంటని ప్రశ్నించా­రు. 

తామిద్దరం బంధువులమని, తాను ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌నంటూ శ్రీనివాస్‌ నాయక్‌ బదులి­వ్వడంతో అక్కడి నుంచి కోటేశ్వ­రరావు వెళ్లి­పో­యాడు. మళ్లీ కాసేపటికి వారిద్దరూ సింగ్‌­నగర్‌ రైతుబజార్‌ వద్దకు వెళ్లి అదే రీతిలో కొట్టు­కుంటుండగా కోటేశ్వరరావు వారిని అడ్డుకు­నేందుకు యత్నించాడు. దీంతో.. శ్రీనివాస్‌­నాయక్, కోటే­శ్వ­రరావు మధ్య మాటా­మాటా పెరి­గింది. 

పోలీస్‌స్టేషన్‌కు రావా­లంటూ శ్రీని­వాస్‌­­నాయ­క్‌­ను తీసుకొస్తుండగా సదరు మహిళ డ్యూటీలో ఉన్న కోటేశ్వరరావు చొక్కా పట్టుకుని పిడుగు­ద్దు­లు గుద్ది లాక్కెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌ కావడంతో విషయం పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖరబాబు దృష్టికెళ్లింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి­న ఇద్దరు కానిస్టేబుళ్లను సీపీ ఎస్వీ రాజ­శేఖ­ర­బాబు సస్పెండ్‌ చేశారు.

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)