Breaking News

తిరుమల క్యూలైన్‌లో ప్రాంక్‌ వీడియో.. టీటీడీ సీరియస్‌

Published on Thu, 07/11/2024 - 19:00

సాక్షి, తిరుపతి: తిరుమలలో కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు.  భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా  ప్రాంక్ వీడియోలు తీయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇక, వీడియో అంశాన్ని భక్తులు టీటీడీ దృష్టికి తీసుకెళ్లడంతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్‌ ఇచ్చింది.

కాగా, వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం.. తమిళనాడుకు చెందిన ముగ్గురు యువకులు శ్రీవారి దర్శనానికి వచ్చారు. తిరుమల లోపల ప్రాంక్‌ వీడియో కోసం.. నారాయణగిరి షెడ్స్‌లోని క్యూలో వెళ్తూ మరో కంపార్టుమెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా కలరింగ్‌ ఇచ్చారు. ఈ సందర్బంగా కంపార్ట్మెంట్‌లో నిరీక్షిస్తున్న భక్తులు ఆ తాళాలు తీసే వ్యక్తిని టీటీడీ ఉద్యోగిగా భావించి  ఒక్కసారిగా పైకి లేచారు. దీంతో, వెంటనే సదరు యూట్యూబర్‌ కంపార్టుమెంట్ నుంచి వెకిలిగా నవ్వుతూ పరుగులు తీశాడు. ఇదంతా మరో యువకుడు వీడియో తీశాడు.

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు నెటిజన్లు టీటీడీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వీడియోలపై టీటీడీ తీవ్రంగా ఖండించింది.  భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా  ప్రాంక్ వీడియోలు తీయడం హేయ మైన చర్య .. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

 

 

ఇదిలా ఉండగా..  తిరుమల ఆలయంలో క్యూ లైన్లలోకి వెళ్లాలంటే సిబ్బంది ఎన్నో రకాలుగా చెకింగ్స్‌ చేసి పంపిస్తారు. భక్తుల వద్ద మొబైల్‌ ఫోన్లు ఉంటే వాటిని స్వాధీనం చేసుకుంటారు. కాగా, ఈ వీడియో చేసిన యువకులు ఆలయంలోకి ఫోన్‌ ఎలా తీసుకెళ్లారు? అనేది తెలియాల్సి ఉంది. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)