Breaking News

పూర్తిస్థాయిలో ‘స్విమ్స్‌’ అభివృద్ధి 

Published on Tue, 06/20/2023 - 09:27

తిరుమల: స్విమ్స్‌ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి మరింత మెరుగైన వైద్యం అందిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం చైర్మన్‌ అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవనంలో జరిగింది. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జేఈఓలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్‌ఓ నరసింహ కిషోర్‌ పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వైవీ మీడియాకు వెల్లడించారు. వాటిలో ముఖ్యమైనవి.. 

►స్విమ్స్‌ ఆసుపత్రిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు రూ.97 కోట్లతో కార్డియో న్యూరో బ్లాక్, రూ.7 కోట్లతో సెంట్రలైజ్డ్‌ వంటశాల, రూ.7.75 కోట్లతో సెంట్రలైజ్డ్‌ గోడౌన్‌ నిర్మాణానికి టెండర్లు ఆమోదం. 
►రూ.4.15 కోట్లతో తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణానికి టెండర్ల ఆమోదం. 
►రూ.2.35 కోట్లతో తిరుమల హెచ్‌వీసీ ప్రాంతంలోని 18 బ్లాకుల్లో గల 144 గదుల అభివృద్ధి పనులు.. 
►రూ.40.50 కోట్లతో తిరుమలలో వెస్ట్‌ ప్యాకేజీకి గాను మూడేళ్ల కాలపరిమితికి ఎఫ్‌ఎంఎస్‌ సేవలను ముంబైకి చెందిన సంస్థకు అప్పగించేందుకు టెండర్ల ఆమోదం. 
►అదేవిధంగా.. రూ.29.50 కోట్లతో శ్రీవారి సేవాసదన్, వకుళమాత విశ్రాంతి గృహం, పీఏసీ 3, 4, బి–టైప్, డి–టైప్‌ క్వార్టర్స్‌ ప్రాంతాల్లో ఎఫ్‌ఎంఎస్‌ సేవలను అదే సంస్థకు అప్పగించేందుకు టెండర్ల ఆమోదం. 
►గుజరాత్‌లోని గాందీనగర్, ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో శ్రీవారి ఆలయాలు నిరి్మంచేందుకు ప్రణాళిక. 
►శ్రీవాణి నిధులపై శ్వేతపత్రం 
►శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని.. ఈ అంశంపై రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం టీటీడీపై దు్రష్పచారం చేసేవారి మీద చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది. అలాగే, టీటీడీలో పూర్తి పారదర్శక పాలన జరుగుతోందని.. ఇందుకు సంబంధించి టీటీడీ ఆస్తులపై 2021 జూన్‌ 21న, బంగారు, నగదు డిపాజిట్లపై 2022 నవంబరు 5న శ్వేతపత్రాలు విడుదల చేశారని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.. నిరాదరణకు గురైన ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం ప్రతినెలా ఆయా ఆలయ కమిటీల బ్యాంకు ఖాతాలో రూ.5 వేలు జమచేయాలని పాలకమండలి నిర్ణయించిందన్నారు. టీటీడీ నుంచి ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టంచేశారు.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)