Breaking News

సామాన్యుల సేవే సంతృప్తినిచ్చింది

Published on Tue, 08/08/2023 - 02:55

తిరుమల: టీటీడీ చైర్మన్‌గా తాను పనిచేసిన నాలుగేళ్లలో ఎక్కువమంది సామాన్య భక్తులకు తిరుమలలో వేంకటేశ్వరస్వామి దర్శనం కల్పించడం సంతృప్తిని ఇచ్చిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 టికెట్లు రద్దు చేయడంతోపాటు సామాన్యులు స్వామివారి తొలి దర్శనం చేసుకునేలా వారికి పెద్దపీట వేశామన్నారు. ఇందుకు వీఐపీ బ్రేక్‌ దర్శన సమయాన్ని మార్చుతూ తీసుకున్న నిర్ణయాలు అత్యంత సంతృప్తినిచ్చాయని చెప్పారు.

నాలుగేళ్లపాటు చైర్మన్‌గా పనిచేసే అదృష్టం ప్రసాదించిన శ్రీవేంకటేశ్వరస్వామివారికి, తనకు అవకాశం ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌కు, సహకారం అందించిన ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు, సిబ్బందికి వైవీ కృతజ్ఞతలు తెలిపారు. నూతన చైర్మన్‌గా నియమితులైన భూమన కరుణాకర్‌రెడ్డి అనుభవం టీటీడీ అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీటీడీ ప్రస్తుత ధర్మకర్తల మండలి చివరి సమావేశం సోమవారం తిరుమలలో వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అధికారులు ఆయన నాలుగేళ్ల పదవీకాలంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

అనంతరం వైవీ సుబ్బారెడ్డి తాజా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో రెండు తెలుగు రాష్ట్రాల్లో 26 ఆలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే రూ.24 కోట్లతో తిరుమలలోని రెండు ఘాట్‌ రోడ్లలో రక్షణ గోడల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. కాగా టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి నాలుగేళ్ల పాటు అందించిన సేవలు అనుసరణీయమని టీటీడీ నూతన చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి కొనియాడారు. ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ మేరకు ఆయన తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం భూమన శాలువాతో వైవీని ఘనంగా సన్మానించారు.

10న టీటీడీ చైర్మన్‌గా భూమన ప్రమాణ స్వీకారం 
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి ఈ నెల 10వ తేదీ ఉదయం 11.44 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన మొదటిగా వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని అనంతరం శ్రీవారి గరుడ అల్వార్‌ సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ మేరకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, భూమన రెండోసారి టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనుండటం విశేషం. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)