Breaking News

టీటీడీ ఉద్యోగులకు క్షమాపణలు చెప్పిన బోర్డు సభ్యుడు

Published on Sat, 02/22/2025 - 10:45

సాక్షి, తిరుమల: టీటీడీ ఉద్యోగుల నిరసన ఫలించింది. టీటీడీ బోర్డుపై ఉ‍ద్యోగ సంఘాల నేతలు విజయం సాధించారు. టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌తో ఉద్యోగికి క్షమాపణలు చెప్పించారు ఈవో. దీంతో, ఉద్యోగులు నిరసనను నిలిపివేసినట్టు తెలుస్తోంది.

టీటీడీ ఉద్యోగుల నిరసన నేపథ్యంలో పాలక మండలి దిగొచ్చింది. ఎట్టకేలకు బోర్డు సభ్యుడు నరేష్‌తో ఉద్యోగికి క్షమాపణలు చెప్పించారు. అయితే, ఉద్యోగిపై దురుసు ప్రవర్తన నేపథ్యంలో పాలక మండలి సభ్యుడి వ్యవహారంపై భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. నరేష్‌ వెంటనే క్షమాపలు చెప్పాలని ఉద్యోగులు 48 గంటల పాటు నిరసనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే నరేష్‌ వారిని క్షమాపణలు చెప్పారు. 

ఇదిలా ఉండగా.. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ఉద్యోగిపై బోర్డు మెంబర్‌ నరేష్‌ బూతులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. కర్ణాటకకు చెందిన పాలకమండలి సభ్యుడు నరేష్‌ ఆలయం వెలుపలి నుంచి వస్తున్న సమయంలో అక్కడే ఉన్న టీటీడీ ఉద్యోగి గేటు తీయలేదు. మహా ద్వారం ముందున్న గేటు తీసేందుకు సదరు ఉద్యోగి నిరాకరించాడు. అయితే, ప్రోటోకాల్‌ పరిధిలో టీటీడీ బోర్డు సభ్యుడికి గేటు తెరవలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు బోర్డు మెంబర్‌ నరేష్‌. అనంతరం, సదరు ఉద్యోగిపై బూతులతో మండిపడ్డారాయన. బయటకు పోవాలని చిర్రుబుర్రులాడారు. ఇలాంటి వారిని ఇక్కడ విధుల్లో ఎందుకు ఉంచారని ఆగ్రహంతో రగిలిపోయారు. అతడిని వెంటేనే అక్కడ నుంచి పంపించి వేయాలని అధికారులకు సూచించారు. అనంతరం, అక్కడి నుంచి టీటీడీ బోర్డు మెంబర్‌ నిష్క్రమించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)