Breaking News

తిరుమలలో 13 కాటేజీల పునర్నిర్మాణం

Published on Tue, 10/10/2023 - 06:29

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తు­లకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ ద్వారా పనిచేసే కార్మికులకు లబ్ధి కలిగించేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం తిరుమల అన్నమయ్య భవనంలో మండలి సమావేశం జరిగింది. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, కమిషనర్‌ సత్యనారాయణ, జేఈవోలు సదాభార్గవి, వీర­బ్రహ్మం, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి టీటీడీ చైర్మన్‌ భూమన మీడియాకు వివరించారు.

కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది వేతనాల పెంపు

  •   కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల కింద ఆరోగ్య శాఖలో విధులు నిర్వహిస్తున్న దాదాపు 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు, ఎఫ్‌ఎంఎస్‌ పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని రూ.12 వేల నుంచి రూ.17 వేలకు పైగా పెంచేందుకు ఆమోదం.
  • శ్రీ లక్ష్మీ శ్రీనివాసా మ్యాన్‌ పవర్‌ కార్పొరేషన్‌ ద్వారా పనిచేస్తున్న దాదాపు 6,600 మంది ఉద్యోగులకు ఇకపై ఏటా 3 శాతం వేతనం పెంపుదల.
  • టీటీడీలో వివిధ సొసైటీల ద్వారా పనిచేస్తూ ఇప్పుడు కార్పొరేషన్‌లోకి మారిన ఉద్యోగు­లకు గత సేవల్ని గుర్తించి ప్రతి రెండేళ్లకు 

3 శాతం ప్రోత్సాహకం ఇచ్చేందుకు నిర్ణయం.

  • కార్పొరేషన్‌ ద్వారా పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైనా అకాల మరణం పొందితే రూ.2 లక్షల నష్టపరిహారం వారి కుటుంబ సభ్యులకు అందించేందుకు ఆమోదం.
  • శ్రీలక్ష్మీ శ్రీనివాసా మ్యాన్‌పవర్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులు దాదాపు 1500 మందికి హెల్త్‌ స్కీమ్‌ వర్తింప చేసేందుకు ఆమోదం. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)