Breaking News

విషాద తరంగం

Published on Sat, 01/17/2026 - 04:22

అల్లూరు: కనుమ పండగ వేళ ఆ కుటుంబాలను విషాద తరంగం ముంచెత్తింది. స­ముద్ర తీరంలో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థుల్లో ఇద్దరు మరణించారు. ఇద్దరు గల్లంతయ్యారు. ఈఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లిలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఈగ అమ్ములు (14), ఈగ బాలకృష్ణ (15) అన్నాచెల్లెళ్లు.  బుచ్చిరెడ్డిపాళెం గిరిజన కాలనీకి చెందిన వీరు అల్లూరు మండల నార్త్‌ఆములూరు పంచాయతీ గోళ్లపాళెం చైల్డ్‌ ఆశ్రమంలో చదువుతున్నారు. వీరి బంధువులు అల్లూరు యర్రపగుంటలో ఉండగా సంక్రాంతి పండగ కావడంతో ఇక్కడకు వచ్చారు.

శుక్రవారం మరో నలుగురు స్నేహితులు కె.అభిషేక్‌(16), జి.సు«దీర్‌(15), ఈగ చిన్నబయ్య, ఎస్‌.వెంకటేష్తో కలిసి ఇసుకపల్లి సముద్ర తీరానికి వెళ్లారు. తీరంలో నీటిలో మునుగుతుండగా ఒక్కసారిగా వచి్చన పెద్ద అలకు ఈగ అమ్ములు, బాలకృష్ణ, కె.అభిõÙక్, జి సు«దీర్‌ గల్లంతయ్యారు. ఈగ చిన్నబయ్య, వెంకటేష్‌ ప్రమాదం నుంచి బయటపడి స్థానికంగా ఉన్న మత్స్యకారులకు సమాచారం ఇచ్చారు. వారు తీరం వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. తొలుత ఈగ అమ్ములు, కాసేపటికి బాలకృష్ణ మృతదేహాలను వెలికి తీశారు. అభిõÙక్, సు«దీర్‌ ఆచూకీ కోసం మెరైన్‌ పోలీసులు గజఈతగాళ్ల సహాయంతో ముమ్మరంగా గాలిస్తున్నారు.  

వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి 
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని ఇసుకపల్లి బీచ్‌లో కనుమ పండుగ రోజు సరదాగా గడిపేందుకు వెళ్ళిన ఆరుగురిలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందడం, మరో ఇద్దరు గల్లంతు కావడం విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటన తనను కలచివేసిందని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)